https://oktelugu.com/

Gamanam Movie: ఆటోలో గమనం సినిమా చూసేందుకు థియేటర్​కు వచ్చిన శ్రియ

Gamanam Movie: ప్రస్తుతం ఉన్న జెనరేషన్​లో కథలో పట్టుంటే చాలు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క నటీనటులు సినిమాలో కీలక పాత్రలకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందే గమనం సినిమా. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా గమనం. ఈ సినిమాతోనే సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. క్రియా ఫిల్మ్​ కార్ప్​, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై […]

Written By: , Updated On : December 10, 2021 / 05:05 PM IST
Follow us on

Gamanam Movie: ప్రస్తుతం ఉన్న జెనరేషన్​లో కథలో పట్టుంటే చాలు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క నటీనటులు సినిమాలో కీలక పాత్రలకు ఓకే చెప్పేస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైందే గమనం సినిమా. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా గమనం. ఈ సినిమాతోనే సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

Gamanam Movie

Gamanam Movie

క్రియా ఫిల్మ్​ కార్ప్​, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Also Read: వరుణ్ తేజ్ అభిమానులకు షాక్… “గని” మూవీ రిలీజ్ వాయిదా

ఈ క్రమంలోనే ఈ చిత్ర కథానాయకుడు శివ కందుకూరి, ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూడగా, నటి శ్రియా శరన్ కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్ లో వీక్షించారు. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి.. ఓ సాధారణ మహిళగా శ్రియ ఆటోలో థియేటర్​కు వచ్చి.. పబ్లిక్​తో కలిసి గమనం సినిమా చూశారు. ఈ సినిమాకు ఇళయరాజ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.  విడుదలైన రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: నయీం డైరీ సినిమాకు షాక్​.. స్టే విధించిన తెలంగాణ హైకోర్టు