Aishwarya Rajesh : తెలుగు మాట్లాడే హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. దురదృష్టం ఏమిటంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది హీరోయిన్లు కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటి హీరోయిన్స్ ఉన్న ఇండస్ట్రీ లో, తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చినప్పటికీ కూడా తెలుగు అనర్గళంగా మాట్లాడే హీరోయిన్స్ లో ఒకరు ఐశ్వర్య రాజేష్. ప్రముఖ సీనియర్ హీరో రాజేష్ కుమార్తె గా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈమె మేనత్త శ్రీలక్ష్మి కూడా ఇండస్ట్రీ లో సీనియర్ నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది. జంధ్యాల సినిమాలను ఇష్టపడే ప్రతీ ఒక్కరికి శ్రీలక్ష్మి గుర్తు ఉంటుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే అయినప్పటికీ, సొంతంగా తన కాళ్ళ మీద ఇండస్ట్రీ లో నిలబడేందుకే ప్రయత్నం చేసింది. అలా తమిళం లో కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.
తమిళం లో దాదాపుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె, తెలుగు ఆడియన్స్ కి ‘కౌశల్య కృష్ణమూర్తి’ అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఈ చిత్రం తర్వాత ఆమె ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీశ్’, ‘రిపబ్లిక్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఈమె ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. చూసేందుకు అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుందని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం తో ముంచెత్తారు. సెకండ్ హాఫ్ లో ఈమె వెంకటేష్ తో సమానంగా కామెడీ చేయడం గమనించదగ్గ విషయం. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు క్యూలు కడుతున్నాయి. కానీ ప్రతీ సినిమాకి సంతకం చేసే రకం కాదు ఐశ్వర్య రాజేష్.
కథలో బలం ఉండాలి, అదే విధంగా ఆమె నటనకు ప్రాధాన్యత కూడా ఉండాలి. అప్పుడే ఆమె ఒక సినిమా చేయడానికి సంతకం చేస్తుంది. ఒక భారీ హిట్ తర్వాత ఇప్పుడు ఆమెకు అవకాశాలు వస్తున్నప్పటికీ చాలా సెలెక్టివ్ గా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అంతే కాదు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఇంతకు ముందు కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునే ఈమె, ఇప్పుడు ఏకంగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుందట. ఒక్కేసారి అంత రేంజ్ రెమ్యూనరేషన్ పెంచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీల కూడా ప్రస్తుతం ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. రెమ్యూనరేషన్ భారీగా పెంచడం వల్ల కొంతమంది తెలుగు నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయాలనే ఆలోచన కూడా విరమించుకున్నట్టు తెలుస్తుంది.