https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2′ లో ఐటెం సాంగ్ కోసం వెయ్యి కోట్ల హీరోయిన్..బాలీవుడ్ వసూళ్లకు ఇక ఆకాశమే హద్దు!

పాన్ ఇండియా లెవెల్ లో ఆమెని ఈ పాట ద్వారానే ప్రేక్షకులు గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆ పాట హిట్ అయ్యిందో. ఇప్పుడు 'పుష్ప 2' చిత్రానికి అంతకు మించిన అద్భుతమైన ఐటెం సాంగ్ ని అందించాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.

Written By:
  • Vicky
  • , Updated On : October 20, 2024 / 07:09 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 :  ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసే పాన్ ఇండియన్ చిత్రాలలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2 : రూల్’. 2021వ సంవత్సరం డిసెంబర్ 17 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్స్, మ్యానరిజమ్స్, ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఒక సెన్సేషన్. ముఖ్యంగా ‘తగ్గేదే లే ‘ అంటూ అల్లు అర్జున్ చేసే మ్యానరిజం మనకి ప్రతీ రోజు ఎదో ఒక సందర్భం లో అలవాటైన మ్యానరిజం గా మారిపోయింది. అంతటి ప్రభావం చూపించిన సినిమా కాబట్టే, అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో పుష్ప చిత్రంపై గానూ నేషనల్ అవార్డు వచ్చింది. ఇది ఆయన అభిమానులకు ఎంతో గర్వించదగ్గ విషయం.

    అందుకే పుష్ప 2 చిత్రానికి దేశ వ్యాప్తంగా అంతటి క్రేజ్ ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే పుష్ప చిత్రంలోని ‘ఊ అంటావా మామ..ఉఊ అంటావా మామ’ అనే పాట దేశ వ్యాప్తంగా ఎలాంటి ఊపు ఊపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, సమంత వేసిన స్టెప్పులు సెన్సేషనల్ గా మారాయి. ఈ ఐటెం సాంగ్ లో నటించిన సమంత కి కూడా క్రేజ్ మామూలుగా రాలేదు. పాన్ ఇండియా లెవెల్ లో ఆమెని ఈ పాట ద్వారానే ప్రేక్షకులు గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆ పాట హిట్ అయ్యిందో. ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్రానికి అంతకు మించిన అద్భుతమైన ఐటెం సాంగ్ ని అందించాడట మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. సినిమా షూటింగ్ మొత్తం 90 శాతం పూర్తి అయ్యిందట, ఒక్క ఐటెం సాంగ్ మినహా. చాలా కాలం నుండి ఏ హీరోయిన్ తో ఈ ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుంది అని మూవీ టీం మొత్తం చర్చించుకొని ఎట్టకేలకు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన శ్రద్దా కపూర్ ని ఈ పాట కోసం ఎంచుకున్నారట.

    ఆమె కూడా అడగగానే ఒప్పేసుకుంది టాక్. శ్రద్ద కపూర్ కి ప్రస్తుతం బాలీవుడ్ యూత్ ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఈమె ‘స్త్రీ 2 ‘ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. సోషల్ మీడియా లో అయితే ఈమెకు ప్రధాన మంత్రిని మించిన ఫాలోవర్లు ఉన్నారు. అలాంటి క్రేజ్ ఉన్న ఈమెతో ఐటెం సాంగ్ చేయిస్తే ఇండియా మొత్తం షేక్ అవుతుందని, అందుకే ఆమెని ఈ పాట కోసం ఎంచుకున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇప్పటికే ‘పుష్ప 2’ కి కావాల్సినంత క్రేజ్ ఉంది. ఇప్పుడు శ్రద్దా కపూర్ ఐటెం సాంగ్ కూడా తోడు అవ్వడంతో ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.