IND VS NZ : న్యూజిలాండ్ తో పరాజయం.. WTC లో భారత్ పరిస్థితి ఏంటంటే?

వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లను టీమిండియా గెలుచుకుంది. అదే ఊపులో ఆ న్యూజిలాండ్ జట్టును కూడా ఓడించాలని భావించింది. కానీ చివరికి బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఓడిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 20, 2024 7:03 pm

IND VS NZ

Follow us on

IND VS NZ :  తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో.. క్రికెట్ సర్కిల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2023 -25 సీజన్ కు సంబంధించిన పాయింట్ల పట్టికలో భారత జట్టు స్థానం విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. పాయింట్లు పట్టికలో ఇప్పటికీ టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే విన్నింగ్ పర్సంటేజ్ లో మాత్రం తగ్గుదల కనిపించింది. దీంతో రాబోయే మ్యాచ్ లు భారత జట్టుకు అత్యంత ముఖ్యంగా మారాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ టాప్ కేటగిరీలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ 12 టెస్టులు ఆడగా.. 8 విజయాలు సాధించింది. మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ను డ్రా గా ముగించింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. ఇక విన్నింగ్ పర్సంటేజ్ 74.24 నుంచి 68.06 కి పడిపోయింది. టీమిండియా తర్వాత ఆస్ట్రేలియా 62.5, శ్రీలంక 55.56 శాతాలతో తర్వాత ఇస్తానని కొనసాగుతున్నాయి. భారత జట్టుపై బెంగళూరులో సాధించిన విజయం నేపథ్యంలో న్యూజిలాండ్ ఆరవ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 44.40 విన్నింగ్ పర్సంటేజ్ కొనసాగిస్తోంది.

ఇలా చేస్తే ఫైనల్ లోకి

ఇప్పటికే రెండుసార్లు భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరుకుంది. మూడోసారి కూడా భారత్ డబ్ల్యూ టీ సీ ఫైనల్స్ వెళ్లాలంటే.. ఇకపై వచ్చే అన్ని మ్యాచ్లలో విజయం సాధించాలి. పాయింట్లు పట్టకలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టుతో ఓటమి వల్ల.. తదుపరి మ్యాచ్ లు భారత జట్టుకు అత్యంత కీలకంగా పరిణమించాయి. భారత్ ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ జట్టుతో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు ఆడాల్సి ఉంది. ఈ ఏడు టెస్టులలో భారత్ కనీసం నాలుగు మ్యాచ్ లలో తప్పనిసరిగా విజయాలు సాధించాలి. అలా గెలిస్తేనే టాప్ -2 స్థానంలో ఉంటుంది. 67.54 పర్సంటేజ్ తో ఫైనల్ వెళ్తుంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 38.89% విజయాలతో ఆరో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా వరుసగా 6 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వేల అన్ని గెలిస్తే ఆ జట్టు విజయాల శాతం 69.44 శాతానికి చేరుకుంటుంది. అదే అది అంత సులువు కాదు.. ఇక ఆస్ట్రేలియా జట్టు భారత జట్టు పై నాలుగు టెస్టులు గెలిచి.. వేరే సిరీస్ వల్ల రెండు డ్రాలు, ఒక మ్యాచ్లో ఓటమిపాలైతే 64.04 విన్నింగ్ పర్సంటేజ్ తో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంటుంది. అయితే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలని భావిస్తోంది. శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో చెరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు టెస్టులను శ్రీలంక గెలిస్తే.. విన్నింగ్ పర్సంటేజ్ 69.23కి చేరుకుంటుంది. అయితే అది అంత సులభం కాదు. ఇక న్యూజిలాండ్ జట్టు కూడా తను ఆడే మిగతా టెస్టులలో అన్నీ గెలిచినా విన్నింగ్ పర్సంటేజ్ 64.29 శాతానికి చేరుకుంటుంది. అయితే ఆ జట్టుకు కూడా అది అంత సులభం కాదు. ఇక ఈ రేసులో బంగ్లా జట్టు, వెస్టిండీస్ చెట్లకు పెద్దగా హోప్స్ లేవు. ఇక ఈ విభాగం నుంచి పాకిస్తాన్ ఎప్పుడో తప్పుకుంది.