https://oktelugu.com/

బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్ తీసే ప్రతి సినిమాలో, ప్రతి సన్నివేశంలో పర్ఫెక్షన్‌ కనిపిస్తుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్‌ సీక్వెల్‌ ఏదైనా చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా చూసుకుంటాడు సుక్కూ. అందుకే ఈ లెక్కల మాస్టారు సినిమాలో ప్రతి ఫ్రేమ్‌, ప్రతీ సన్నివేశం లెక్క తప్పకుండా ఉంటుంది. ఇక, తన ప్రతి మూవీలో ఓ ఐటం గ్యారంటీ. పైగా అది మామూలుగా ఉండదు. ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి రంగస్థలంలో జిగేల్‌ రాణి వరకూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2020 / 05:20 PM IST
    Follow us on


    సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్ తీసే ప్రతి సినిమాలో, ప్రతి సన్నివేశంలో పర్ఫెక్షన్‌ కనిపిస్తుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్‌ సీక్వెల్‌ ఏదైనా చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా చూసుకుంటాడు సుక్కూ. అందుకే ఈ లెక్కల మాస్టారు సినిమాలో ప్రతి ఫ్రేమ్‌, ప్రతీ సన్నివేశం లెక్క తప్పకుండా ఉంటుంది. ఇక, తన ప్రతి మూవీలో ఓ ఐటం గ్యారంటీ. పైగా అది మామూలుగా ఉండదు. ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి రంగస్థలంలో జిగేల్‌ రాణి వరకూ ప్రతి పాటను ప్రత్యేకంగా మరలిచాడు. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచాడు. ఆ ఐటం నంబర్లో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఉంటే దాని ఊపే వేరు. సుక్కూ క్రియేటివిటీకి బన్నీ మార్కు స్టెప్పులు తోడైతే ఏ పాట అయినా సూపర్ హిట్‌ అవ్వాల్సిందే.

    Also Read: ప్రభాస్‌, మహేశ్‌, పవన్‌ కావాలంటున్న బోల్డ్‌ బ్యూటీ!

    ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంలో కూడా సుక్కూ తన మార్కు ఓ స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశాడు. ఈ పాట కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. పాయల్‌ రాజ్‌పుత్‌ను ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, బన్నీ పక్కన ఓ రేంజ్‌ ఉన్న హీరోయిన్‌ అయితే సూటవుతుందని సుకుమార్భావిస్తున్నాడు. పైగా, ఇది పాన్‌ ఇండియా మూవీ. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. కాబట్టి అందరికీ పరిచయం ఉన్న ఓ హీరోయిన్‌తో ఐటం‌ సాంగ్‌ చేయించాలని సుక్కూ నిర్ణయానికి వచ్చాడట.

    Also Read: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ అప్పుడే మొదలెట్టారు.. !

    ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ను సంప్రదించారట. ప్రభాస్‌ సరసన ‘సాహో’లో నటించిన శ్రద్ధాకు ఇప్పటికే టాలీవుడ్‌ గురించి తెలుసు. ఐటం సాంగ్‌లో ఆమె నర్తిస్తే ‘పుష్ప’ హిందీ మార్కెట్‌కు కూడా ప్లస్‌ అవుతుందని యూనిట్‌ ఆశిస్తోంది. ఇదే విషయాన్ని శ్రద్ధ ముందు ఉంచితే ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందట. శ్రద్ధ ఒప్పుకుంటే బన్నీతో కలిసి ఆమె స్టెప్పులు ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఏ కారణం వల్ల అయినా శ్రద్ధ కాదంటే బాలీవుడ్‌లో మరో యువ నటి ఊర్వశి రౌటెలా పేరును కూడా సుక్కూ పరిశీలిస్తున్నాడట. కాగా, గంధం చెక్కల స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ‘పుష్ప’లో బన్నీ సరసన రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్.