Telugu News » Entertainment » Shraddha kapoor is the heroine who collected rs 600 crores for the movie street 2 staying in a rented house
Shraddha Kapoor : రూ.600 కలెక్షన్స్ రాబట్టిన హీరోయిన్ అద్దె ఇంట్లో .. అసలు విషయమేంటంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాల గురించి మాత్రమే కాకుండా చిన్న చిత్రాల గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది. ఎందుకంటే భారీ చిత్రాలను బీట్ చేస్తూ కలెక్షన్లలో కొల్లగొడుతోంది ‘స్త్రీ-2’ మూవీ. ఈ మూవీలో శ్రద్ధా కపూర్ మెయిన్ రోల్ లో నటించారు. ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి లు వివిధ పాత్రల్లో పోషించారు.
Shraddha Kapoor : ఒక్కసారి సినిమా అవకాశం వస్తే చాలు.. జీవితం మారిపోతుందని చాలా మంది ఆశ. అందుకే సినిమా ఛాన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమాల్లో అవకాశం వస్తే డబ్బుతో పాటు అదనపు సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా రెండు, మూడు సినిమాల్లో నటించిన వారు లైఫ్ సెటిలైన వారున్నారు. సినిమాల ద్వారా సెలబ్రెటీగా మారిన తరువాత పలు యాడ్స్ లో నటించి ఇతర ఆదాయం పొందేవారు ఉన్నారు. దీంతో అతి కొద్ది కాలంలోనే సొంత ఇల్లు, కారు కొనుగోలు చేస్తుంటారు. అయితే బాలీవుడ్ కు చెందిన ఓ నటి చేసిన సినిమా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలో ఆమనే మెయిన్ హీరోయిన్. కానీ రియల్ లైఫ్ లో ఆమె ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లోకి మారబోతుందట. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద సినిమాలో నటించినా.. ఆ హీరోయిన్ కు సొంత ఇల్లు లేదా? అని ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఆ హీరోయిన్ అద్దె ఇంట్లోకి మారడానికి కారణం ఏంటి? అసలు ఎవరా హీరోయిన్?
బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చిత్రాల గురించి మాత్రమే కాకుండా చిన్న చిత్రాల గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది. ఎందుకంటే భారీ చిత్రాలను బీట్ చేస్తూ కలెక్షన్లలో కొల్లగొడుతోంది ‘స్త్రీ-2’ మూవీ. ఈ మూవీలో శ్రద్ధా కపూర్ మెయిన్ రోల్ లో నటించారు. ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి లు వివిధ పాత్రల్లో పోషించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. స్త్రీ అనే మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ కామెడీతో పాటు హర్రర్ సస్పెన్స్ తో అలరిస్తోంది.
స్త్రీ 2 ఆగస్టు 15న రిలీజ్ అయింది. విడుదలయిన నుంచి ఇప్పటి వరకు రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ.412 కోట్లు సాధించింది. చిన్న సినిమాగా థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ కలెక్షన్లను చూసి బీ టౌన్ షాక్ అవుతుంది. దీంతో ఈ సినిమాలో నటించిన వారి గురించి ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు.
శ్రద్ధా కపూర్ తాజాగా కొత్త అద్దె ఇంట్లోకి మారబోతుందట. ముంబై బీచ్ కు ఎదురుగా ఉన్న ఈ భవనంలో అక్షయ్ కుమార్ అపార్టమెంట్ కూడా ఉంది. అయితే ఇందులో హృతిక్ రోషన్ ఉన్న అద్దె ఇంట్లోకి హీరో వరుణ్ ధావన్ రావాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు శ్రద్ధా కపూర్ ఈ ఇంట్లోకి అద్దెకు వస్తుంది. ఈ ఇంటిక అద్దె రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. త్వరలోనే శ్రద్ధ కపూర్ ఈ ఇంట్లోకి మారబోతుంది.
శ్రద్ధా కపూర్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కూతురు అన్న విషయం తెలిసిందే. ఆయన 1987లో జుహులోనే ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే దానిని రీ మోడలింగ్ చేయాలని అనుకుంటున్నారు. అందుకోసమే శ్రద్ధా కపూర్ ప్రస్తుతం అద్దె ఇంట్లోకి వెళ్తుంది. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి.. కన్ స్ట్రక్షన్ పూర్తయిన తరువాత తిరిగి సొంత ఇంట్లోకి మారుతుంది. ఇక శ్రద్ధా కపూర్ స్త్రీ 2 తరువాత వరుణ్ ధావన్ తో కలిసి భేడియా సీక్వెల్ మూవీలో నటించే అవకాశం ఉంది.