https://oktelugu.com/

Nagarjuna Birthday Special: తొలి రెండు సినిమాలను నాగేశ్వరరావు గారి అబ్బాయికి నటనే రాదు అన్నారు..కట్ చేస్తే నాలుగేళ్లలో సూపర్ స్టార్!

చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్, సూపర్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు సినీ రంగానికి పరిచయం అవుతున్న సమయంలో ఎలాంటి క్రేజ్ ఉండేదో, అంతకు మించిన క్రేజ్ నాగార్జున మొదటి సినిమాకి వచ్చింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన 'విక్రమ్' చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 01:22 PM IST

    Nagarjuna Birthday Special

    Follow us on

    Nagarjuna Birthday Special: అక్కినేని నాగేశ్వర రావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడితో ట్రెండ్ సృష్టించి, ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా యూత్ మరియు లేడీ ఆడియన్స్ లో నాగార్జున కి ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే క్యూలు కట్టేస్తారు. కామెడీ , మాస్, ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ మాత్రమే కాదు, భక్తిరస చిత్రాలు కూడా తీసి ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించుకున్న చరిత్ర ఆయనది. అలాంటి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాగార్జున 1986 వ సంవత్సరం లో విక్రమ్ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఒక సూపర్ స్టార్ కొడుకు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఊహించొచ్చు.

    చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్, సూపర్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబు సినీ రంగానికి పరిచయం అవుతున్న సమయంలో ఎలాంటి క్రేజ్ ఉండేదో, అంతకు మించిన క్రేజ్ నాగార్జున మొదటి సినిమాకి వచ్చింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘విక్రమ్’ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా స్టార్ హీరోల రేంజ్ లో వచ్చాయి. కమర్షియల్ గా అప్పట్లో టాప్ 5 చిత్రాల్లో ఒక చిత్రంగా నిల్చింది. కానీ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు చెప్పేది ఏమిటంటే, నాగార్జున లో అసలు నటనే లేదు, డ్యాన్స్ చేయలేకపోతున్నాడు, ఫైట్స్ కూడా అంతంత మాత్రమే అని అప్పట్లో ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన. మొదటి సినిమా తర్వాత ఆయన నుండి విడుదలైన ‘కెప్టెన్ నాగార్జున’, ‘అరణ్య కాండా’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఈ సినిమాల్లో కూడా నాగార్జున నటనపై ఆడియన్స్ నుండి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ ని అర్థం చేసుకున్న నాగార్జున, తనని తాను బాగా మార్చుకున్నాడు. ‘మజ్ను’ చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చి భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టాడు.

    ఆ తర్వాత సినిమా సినిమాకి తనని తాను మెరుగు పర్చుకుంటూ అనతి కాలంలోనే సూపర్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు. మాస్ మరియు రొమాంటిక్ రోల్స్ లో చూసిన ఒక హీరోని భక్తిరస చిత్రంలో ఆడియన్స్ చూస్తారని ఏ హీరో అయినా నమ్ముతాడా?, కానీ నాగార్జున నమ్మి ‘అన్నమయ్య’ చిత్రం తీసాడు. కమర్షియల్ గా ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అలా నాగార్జున లాగ ప్రయోగాత్మక చిత్రాలను తీసి సక్సెస్ అయిన హీరోలు చాలా తక్కువ. అందుకే నాగార్జున అగ్ర హీరోలలో ఎంతో స్పెషల్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, బిజినెస్ మెన్ గా కూడా నాగార్జున ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. కేవలం నటుడిగా, బిజినెస్ మెన్ గా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఆయన కోట్లాది మంది ప్రజాభిమానం పొందాడు. ఇప్పటికీ కూడా నేటి తరం హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న నాగార్జున భవిష్యత్తులో ఎలాంటి హిట్స్ అందుకోబోతున్నాడో చూడాలి.