https://oktelugu.com/

పచ్చి బంగాళాదుంపలు తింటూ కడుపు నింపుకుంటున్నారు!

విజయవాడ నగరానికి పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. నగరంలోని లేడీస్ టీలరింగ్ షాపుల వద్ద మగ్గం పని చేసే వీరంతా అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు. లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటూ కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పారు. క్రీస్తురాజపురంలో పశ్చిమ బెంగాల్ వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు. వీరంతా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాధికారులు […]

Written By: , Updated On : April 18, 2020 / 05:06 PM IST
Follow us on


విజయవాడ నగరానికి పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. నగరంలోని లేడీస్ టీలరింగ్ షాపుల వద్ద మగ్గం పని చేసే వీరంతా అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు. లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటూ కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పారు. క్రీస్తురాజపురంలో పశ్చిమ బెంగాల్ వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు. వీరంతా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం‌ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడంతో ఏ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదంటున్నారు. వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు‌ చేసుకోపొవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని లేనిపక్షంలో సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.