Nandinirai : వెండితెరపై అవకాశం రావాలంటే స్టూడియోల చుట్టూ తిరగనక్కర్లేదు. మోడల్ గా రాణిస్తే చాలు.. సినిమావాళ్లే తమ వెంట తిరుగుతారని కొందరు భామలు నిరూపిస్తున్నారు. యాంకర్ గా, ఇతర ప్రోగ్రామ్స్ ద్వారా కొందరు పాపులర్ అవుతుంటే..మరికొందరు మాత్రం మోడలింగ్ రంగంలో తమదైన ప్రతిభా చూసిస్తూ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హాట్ భామ నందినీ రాయ్. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగా ముందుగా బాలీవుడ్ లో అవకాశం తెచ్చుకొని.. ఆ తరువాత తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. అయితే సినిమాల్లో ఛాన్సెస్ కొట్టేస్తూనే బిగ్ బాస్ సీజన్ 2లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫిక్స్ తో దర్శనమిస్తున్న నందినీ లేటేస్టుగా షర్ట్ విప్పేసి అందాలతో ఆకట్టుకుంటోంది.

నందినిరాయ్ 1990 సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని సింధీ కుటుంబంలో జన్మించింది. నగరంలోని సెయింట్ అప్ఫోన్స్ హైస్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి ఆ తరువాత 2005లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత హైయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లిన ఈ బ్యూటీ ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే మోడల్ గా నందినీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న ఆమె.. పలు బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొని అవార్డులు గెల్చుకుంది.

అయితే వెండితెరకు రావాలన్న తపనతో ప్రయత్నాలు ప్రారంభించగా.. హిందీలో అవకాశం వచ్చింది. ‘ఫ్యామిలీ ప్యాక్ ’ అనే సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తరువాత తెలుగులోకి ‘మాయ’ అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు తెలుగులో నటిస్తూనే అటు హిందీ సినిమాల్లోనూ అవకాశం తెచ్చుకున్న ఈమె 10కి పైగా చిత్రాలో నటించింది. టీవీ షోల్లోనూ నందిని రాయ్ కి గుర్తింపు వచ్చింది.


బుల్లితెరపై ఉర్రూతలూగించే బిస్ బాస్ సీజన్ 2లో నందిని రాయ్ హౌస్ ఎంట్రీ ఇచ్చింది. అయితే మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఈ భామ ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. కానీ మిగతా హీరోయిన్లతో సమానంగా స్టార్ గుర్తింపు అయితే రాలేదు. దీంతో అవకాశాల కోసం తెగ కష్టపడుతోంది. ఇందులో భాగంగా హాట్ హాట్ ఫోజులిస్తూ ఆడియన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. లేటేస్టుగా నందిని రాయ్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. షర్ట్ విప్పేసి లో దుస్తులతో తన అందచందాలను ఆరబోయడంతో కుర్రాకారు పిచ్చోళ్లవుతున్నారు.

