Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు యంగ్ హీరోలు వరుస సినిమాలో చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా కూడా వాళ్ళు చేస్తున్న సినిమాలు కొన్ని సూపర్ సక్సెస్ లను సాధిస్తే కొన్ని మాత్రం వరుస డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడంలో మాత్రం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అవుతుందనే చెప్పాలి. నిజానికి ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు గాని, స్టార్ హీరోలు గాని డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేయాలని చూస్తున్నప్పటికి వాళ్ళకి సరిపడా కథలు దొరకడం లేదని బాధపడుతున్నారు. కానీ ఇలాంటి సందర్భంలోనే వెంకటేష్ (Venkatesh) లాంటి స్టార్ హీరో మాత్రం మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. ముఖ్యంగా వెంకటేష్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించడానికి గల కారణం ఏంటి అంటే సినిమా స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికి ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో భారీగా పాల్గొన్నారు. దాంతో సినిమా ఎక్కువ సంఖ్యలో జనాలకు రీచ్ అయింది. అలాగే సినిమాని చూడాలనే క్యూరియాసిటీ కూడా ప్రతి ఒక్కరులో కలిగింది. దాని ద్వారా సినిమా అల్టిమేట్ విజయాన్ని అందుకుంది. కాబట్టి ప్రతి స్టార్ హీరో గాని యంగ్ హీరో గాని వెంకటేష్ ను ఫాలో అవుతూ ముందుకు సాగితే మాత్రం వాళ్లకు కూడా మంచి విజయాలు దక్కుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఒక సినిమాని చేయడం ముఖ్యం కాదు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంపార్టెంట్ అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మన స్టార్ హీరోలు ఇలాంటివేమీ చేయకుండా మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేసినంత మాత్రాన సినిమా ఆడుతుంది అని అనుకుంటే పొరపాటే…
అందుకే వీలైనంత వరకు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తేనే ఆ మూవీ మీద బజ్ క్రియేట్ అయి సినిమాని చూడాలి అనుకునే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఆటోమేటిగ్గా సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన కూడా ప్రేక్షకులందరు సినిమాను చూస్తూ ఆ మూవీని సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తారు…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచాడు. అనిల్ రావిపూడి సైతం సీనియర్ హీరో అయిన వెంకటేష్ తో భారీ సక్సెస్ ని సాధించి మరొక సీనియర్ హీరో అయిన చిరంజీవితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…