థియేటర్ల పరిస్థితి సంక్రాంతికి మారనుందా?

కరోనాతో సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింది. గత ఆరేడు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. కొద్దినెలల క్రితమే షూటింగులకు పర్మిషన్ రావడంతో టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. అదేవిధంగా అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే కరోనా ఎఫెక్ట్ నుంచి ఈ రంగం ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదని టాక్ విన్పిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కొద్దినెలులుగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ రంగం బాగా పుంజుకుంది. కొత్త సినిమాలన్నీ […]

Written By: NARESH, Updated On : November 1, 2020 12:38 pm
Follow us on

కరోనాతో సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింది. గత ఆరేడు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు మూతపడ్డాయి. కొద్దినెలల క్రితమే షూటింగులకు పర్మిషన్ రావడంతో టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. అదేవిధంగా అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే కరోనా ఎఫెక్ట్ నుంచి ఈ రంగం ఇప్పట్లో కోలుకునేలా కన్పించడం లేదని టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

కొద్దినెలులుగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ రంగం బాగా పుంజుకుంది. కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజవుతుండటంతో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా అటువైపు మరలినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గకపోవడం.. 50శాతం అక్యుపెన్సీ నిబంధనలు ఉండటంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Also Read: గాంధీ, నెహ్రూలను కూడ వదలని కంగనా

అయితే సంక్రాంతి నాటికి థియేటర్లు కళకళలాడటం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే పలు కొత్త సినిమాలు సంక్రాంతికి రానున్నట్లు రిలీజ్ డేట్స్ ప్రకటించింది. ప్రతీయేటా పెద్ద హీరోల చిత్రాలు మాత్రమే బరిలో ఉండేవి. అయితే ఈసారి ఏకంగా ఐదారు సినిమాలు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించడంతో పోటీ నెలకొంది.

Also Read: పవర్ స్టార్ పవన్ ప్యాకేజీ.. తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ఈ ఏడాది ఆరంభంలోనే కరోనా రావడంతో తొలి రెండు నెలలు మినహా నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ నష్టాలను పూడ్చుకునేందుకే వచ్చే ఏడాది పెద్దఎత్తున సినిమాలు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతి నుంచి సినిమాల మధ్య పోటీ వాతావరణం కన్పిస్తోంది. అయితే సినిమా రిలీజులను మాత్రం కరోనానే డిసైడ్ చేసే అవకాశం కన్పిస్తోంది.