Short film actress with star hero : నేపథ్యం లేకుండా పరిశ్రమలో అరంగేట్రం చేయడం అంత సులభం కాదు. అలాంటి నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు తామేంటో నిరూపించుకోవాల్సిందే. అందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ గా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, దర్శకత్వం వహించిన పలువురు నటులు, దర్శకులు ప్రస్తుతం పరిశ్రమలో రాణిస్తున్నారు. కొందరు స్టార్స్ కూడా అయ్యారు. రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం, సుహాస్, చాందిని చౌదరి ఈ కోవకు చెందినవారే. పైన ఫోటోలో ఉన్న అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి అనంతరం సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తుంది.
ఆమె ఎవరో కాదు తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్. ఆంధ్రప్రదేశ్, అనంతపురంలో పుట్టిన ప్రియాంక అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. 2017లో విడుదలైన కలవరమాయే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. రెండో చిత్రంతో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పక్కన నటించింది. టాక్సీవాలా మూవీలో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. అనంతరం కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీలో నటించింది. సాయి కుమార్ కీలక రోల్ చేసిన ఈ చిత్రం సైతం హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
గమనం అనే యాంథాలజీ మూవీ చేసింది. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా విడుదలైన టిల్లు స్క్వేర్ లో ప్రియాంక గెస్ట్ రోల్ చేయడం విశేషం. అలాగే మ్యాడ్ 2లో కూడా ప్రియాంక నటించింది. ఆమె కెరీర్లో నటించిన చిత్రాలన్నీ దాదాపు హిట్. అయినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు కెరీర్ ఉండదు.
మన దర్శక నిర్మాతలకు పొరుగింటి పుల్లకూరే ఇష్టం. నార్త్ అమ్మాయిలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. లేదంటే కన్నడ, మలయాళ అమ్మాయిల వెనకబడతారు. అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో సక్సెస్ అయ్యారు. తెలుగులో వారికి పెద్దగా ఆదరణ దక్కలేదు.