సర్కారు వారి పాట :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో సారథి స్టూడియోలో మొదలైంది. దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మహేష్ బాబు షూట్ లో జాయిన్ అవ్వడంతో ఈ సినిమా సెట్ లో సందడి మొదలైంది. ఏప్రిల్ చివరి వారంలో ‘సర్కారు వారి పాట’ సాంగ్ షూటింగ్ జరుగుతూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ అటాక్ చేసింది. దాంతో అప్పుడు షూట్ ఆగింది. ఇప్పుడు ఆ సాంగ్ షూట్ తోనే తిరిగి షూట్ మొదలైనట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే విదేశాల్లో కూడా షూట్ కి రెడీ అవుతుంది టీమ్. విదేశాల్లో జరిగే షెడ్యూల్ లో కీర్తి సురేష్ కూడా జాయిన్ అవ్వనుంది.
అఖండ :
నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న ఈ సినిమా షూట్ కూడా నిన్న మొదలై.. ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ల్యాండ్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో షూట్ చేసున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సినిమా కూడా మూడు నెలల గ్యాప్ తర్వాతే మొదలైంది.
ఏజెంట్ :
అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను ఇప్పటికే పూర్తీ చేశాడు. అయితే, ఈ సినిమా విడుదలకు మోక్షం ఎప్పుడో క్లారిటీ లేదు కానీ, అఖిల్ తన ఇదో సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు. షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమాలో కొత్త భామ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతునట్లు తెలుస్తోంది.
హీరో రామ్ – లింగుస్వామి సినిమా :
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని – తమిళ దర్శకుడు లింగుస్వామి కలయికలో రానున్న సినిమా షూటింగ్ కూడా మొన్న హైదరాబాద్ లో ఓ గెస్ట్ హౌస్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ముందుగా ఓ రొమాంటిక్ సాంగ్ తో ఈ సినిమా షూట్ మొదలుపెట్టారు. హీరోయిన్ కృతి శెట్టి – రామ్ పై ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
ఇక హీరో మంచు మనోజ్, గోపీచంద్ – మారుతి సినిమా, అలాగే కిరణ్ అబ్బవరం కొత్త సినిమా, అలాగే మిగిలిన హీరోలు సినిమాలు కూడా ఇప్పటికే షూట్ ను మొదలుపెట్టాయి. రేపటి నుండి నేషనల్ స్టార్ ప్రభాస్ తన మరో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కొత్త షెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే స్టార్ట్ చేయనున్నాడు.