https://oktelugu.com/

జగన్ కు ఆ ఇద్దరి బాధ తప్పదా..?

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఇంచుమించు మరో సంవత్సరంన్నర పాటు ప్రభుత్వం కొనసాగినా ఆ తరువాత ఎన్నికల హడావుడిలో పడాల్సిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడానికి జగన్ ప్రణాళిక వేయాల్సిందే. అయితే 2019 నాటి పరిస్థితులకు 2914 వరకు కొన్ని మారుతాయన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో జగన్ అండగా ఉండి పార్టీని గెలిపించిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారుతారా..? అని అనుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను జగన్ తనకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 14, 2021 / 09:43 AM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఇంచుమించు మరో సంవత్సరంన్నర పాటు ప్రభుత్వం కొనసాగినా ఆ తరువాత ఎన్నికల హడావుడిలో పడాల్సిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడానికి జగన్ ప్రణాళిక వేయాల్సిందే. అయితే 2019 నాటి పరిస్థితులకు 2914 వరకు కొన్ని మారుతాయన్న చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో జగన్ అండగా ఉండి పార్టీని గెలిపించిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారుతారా..? అని అనుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను జగన్ తనకు అనుకూలంగా మార్చుకోకపోతే సొంత కుంపటిలోనే చిచ్చు రేపే ప్రమాదం ఉందని అంటున్నారు.

    2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ ఒక్కరే కారణం కాదు. ఆయన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ఎంతో కృషి చేశారు. తెలంగాణ అంతటా పర్యటించిన షర్మిల యూత్ ను ఆకట్టుకొనే విధంగా ప్రసంగాలు చేశారు. అటు ఏపీలోనూ పర్యటించి తనదైన వ్యాఖ్యలతో పార్టీని గెలిపించుకున్నారు. అయితే కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టింది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదంలో షర్మిల తెలంగాణ వైపే ఉన్నారు.

    రాను రాను షర్మిల తెలంగాణలో పార్టీ సక్సెస్ అయితే జగన్ కు పోటీగా మారే అవకాశాలున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అటు విజయలక్ష్మి షర్మిల వైపు ఉండే అవకాశం ఉండడంతో జగన్ తరుపున ప్రచారం చేస్తారా..? లేదా…? అన్నది చర్చనీయాంశంగా ఉంది. దీంతో 2024 ఎన్నికల్లో పరిస్థితులు మారనున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో ముందుగానే ఎన్నికలు జరగనున్నందున్న రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.

    ఇక వైపీపీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి గత ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశాడు. ముఖ్యంగా అంతకుముందు సీఎంగా ఉన్న చంద్రబాబును దెబ్బకొట్టడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్టు విషయంలో జోక్యం చేసుకోవడంతో పార్టీకి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని పార్టీలోని నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి జగన్ ఈ పరిస్థితులను ఎలా చక్కబెడుతారోనన్న ఆసక్తిచర్చ సాగుతోంది.