ఆ నిర్మాత మోసం చేశాడని మహిళ ఆత్మహత్యాయత్నం

మలక్ పేట ప్రాంతంలో కొంతకాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయ అనే మహిళ హల్ చల్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని.. ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దకు వచ్చి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బన్నీ వాసు, ఆయన సంబంధీకులు ఇప్పటికే నాలుగు సార్లు జూబ్లీహిల్స్ పోలీసులకు […]

Written By: NARESH, Updated On : July 14, 2021 10:33 am
Follow us on

మలక్ పేట ప్రాంతంలో కొంతకాలంగా పుచ్చకాయలు విక్రయిస్తున్న సునీత బోయ అనే మహిళ హల్ చల్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని.. ఆత్మహత్యకు పాల్పడుతానంటూ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్దకు వచ్చి ఆత్మహత్యాప్రయత్నం చేసింది. బన్నీ వాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానంటూ మోసం చేశాడని ఆమె చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే బన్నీ వాసు, ఆయన సంబంధీకులు ఇప్పటికే నాలుగు సార్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రెండు సార్లు జైలుకు కూడా వెళ్లారు. రెండు సార్లు ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చికిత్స కూడా సునీత పొందారు. మెంటల్ గా కొంత డిస్టబెన్స్ గా ఉందని ఆమె ఆనవాళ్లు చూస్తే తెలుస్తోంది.

తాజాగా వారం కిందటే ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. బన్నీ వాసు బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆ వీడియోలో పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందుకు వచ్చిన సునీత బోయను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేసి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. మానసిక చికిత్సాలయానికి తరలించాలని జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయమూర్తిని కోరారు.