Pawan Kalyan love Story : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. యంగ్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ఎవరికి ఎలాంటి మార్కెట్ క్రియేట్ అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనే విషయాలు కూడా తన సక్సెస్ ను డిసైడ్ చేయబోతున్నాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది. తన తోటి హీరోలు వరుసగా పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధిస్తూ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం ఓజి సినిమాతో పామ్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో నందిని అమ్మాయిని మొదట పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో డివోర్స్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బద్రి (Badri) సినిమా సమయంలో ముందుగా అమీషా పటేల్ (Ameesha Patel) ని ప్రేమించారట.
Also Read : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి సినిమాల్లో తను రాణించాలి అనే ఉద్దేశంతో ఉన్నానని తను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తన మీద కోపంతో రేణుదేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటూ ఒక్కప్పుడు దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న గీతాకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే తెలియజేశాడు.
మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడటం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తన అభిమానుల కోరిక మేరకే ఆయన సినిమాలను చేస్తున్నాడు…ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…