తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా చెలామణి అవుతున్న వారిలో మహేష్ బాబు ఫస్ట్ రోలోనే ఉంటారు. సినిమా స్టోరీ మొదలు.. టైమ్ షెడ్యూల్ వరకు అన్నింటా పక్కాగా ఉండే ప్రిన్స్.. రెమ్యునరేషన్ వద్ద కూడా అత్యంత ప్రొఫెషనల్ గా ఉంటారు. తన బ్రాండ్ వాల్యూ ప్రకారం పారితోషికం ఫిక్స్ చేస్తుంటారు. అయితే.. త్వరలో త్రివిక్రమ్ తో తీయబోతున్న సినిమాకు మహేష్ సెట్ చేసుకున్న నంబర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగానే కాకుండా.. బెస్ట్ బిజినెస్ మేన్ అని కూడా చెప్పొచ్చు. ఇటు జీఎంబీ థియేటర్ తో సినిమా ఎగ్జిబిటర్ రంగంలోకి దిగిన మహేష్.. ఇదే పేరుతో హోం ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. బయట సినిమాలు నిర్మించడంతోపాటు తన సినిమాల్లోనూ పార్ట్ నర్ గా జాయిన్ అవుతుంటారు. ఆ విధంగా.. అటు హీరో రెమ్యునరేషన్, ఇటు నిర్మాత షేర్ కలిపి గట్టిగానే ఇంటికి తీసుకెళ్తుంటారు.
అయితే.. త్రివిక్రమ్ సినిమాలో ఆ ఛాన్స్ లేదని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ – రాధాకృష్ణ ఇద్దరూ ఒకే గూటి పక్షులు కాబట్టి వాళ్లే పార్టనర్స్ గా ఉంటున్నారట. దీంతో.. మహేష్ బ్యానర్ కు ఛాన్ లేకుండా పోయింది. అందువల్ల.. ఆ మొత్తాన్ని రెమ్యునరేషన్ లోనే రాబట్టుకున్నట్టు సమాచారం.
పైగా.. మహేష్-త్రివిక్రమ్ కాంబోపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఖాయం. అది కూడా పదేళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగానే వస్తాయి. ఇవన్నీ మేళవించి గట్టి నంబర్ ను ఫిక్స్ చేసుకున్నాడట మహేష్. అందుతున్న సమాచారం ప్రకారం రూ.65 నుంచి రూ.70 కోట్ల మేర డీల్ సెట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకే ఇంత వసూలు చేస్తే.. రాజమౌళి సినిమాకు ఇంకెంత పారితోషికం తీసుకుంటారోననే చర్చ మొదలైంది.