Raja Saab Movie : ‘రాజా సాబ్’ కోసం డైరెక్టర్ మారుతీ ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..? ఫ్లాప్స్ వచ్చినా డిమాండ్ తగ్గలేదుగా!

రెబెల్ స్టార్ ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ భారీ కాంబినేషన్స్ కోసమే ఎదురు చూస్తుంటారు. తమకు ఉన్న బిగ్గెస్ట్ స్టార్ డమ్ ని చిన్న డైరెక్టర్స్ చేతిలో పెట్టి రిస్క్ చేసే సాహసం చేయరు. కానీ ప్రభాస్ చేసాడు. మారుతీ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తుందని ఎవరైనా ఊహించారా..?, కానీ అదే జరిగింది.

Written By: Vicky, Updated On : October 10, 2024 9:13 pm
Follow us on

Raja Saab Movie : రెబెల్ స్టార్ ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ భారీ కాంబినేషన్స్ కోసమే ఎదురు చూస్తుంటారు. తమకు ఉన్న బిగ్గెస్ట్ స్టార్ డమ్ ని చిన్న డైరెక్టర్స్ చేతిలో పెట్టి రిస్క్ చేసే సాహసం చేయరు. కానీ ప్రభాస్ చేసాడు. మారుతీ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వస్తుందని ఎవరైనా ఊహించారా..?, కానీ అదే జరిగింది. మారుతీ కి ఈ చిత్రం ముందు అన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ మాత్రమే ఉన్నాయి. స్టార్ హీరోల సంగతి కాసేపు పక్కన పెడితే, మీడియం రేంజ్ హీరోలు కూడా మారుతీ కి అవకాశం ఇవ్వరు. కానీ ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పిలవబడే ప్రభాస్ స్టోరీ వినగానే ల్యాగ్ చేయకుండా వెంటనే ఓకే చెప్పేశాడట.

మారుతీ కూడా తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఈ చిత్రం లో హీరోయిన్స్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తారీఖున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ‘కల్కి’ చిత్రం థియేటర్స్ లో ఉండగానే విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది, చాలా కాలం తర్వాత వింటేజ్ స్టైలిష్ ప్రభాస్ ని చూశామని అభిమానులు మురిసిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం డైరెక్టర్ మారుతీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకి డైరెక్టర్ మారుతీ ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది ఆయన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంతకు ముందు ఆయన ఒక్కో సినిమాకు దాదాపుగా 5 నుండి 6 కోట్ల రూపాయిలు మాత్రమే తీసుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా కావడంతో ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్ వచ్చిన డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడమే ఎక్కువ అని అనుకుంటున్న ఈ రోజుల్లో, 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చి, ప్రభాస్ సినిమాని చేతిలో పెట్టడం అంటే, మారుతీ ఎక్కడ నక్క తోక తొక్కి వచ్చాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇలాంటి అదృష్టం ఎవరికీ రాదు. మరి ప్రభాస్ ఇతని మీద పెట్టిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా?, లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఈ చిత్రం నుండి టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Tags