Sathyam Sundharam Movie : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో వచ్చే సినిమాల కంటెంట్ చాలా వైవిధ్యభరితంగా మారిపోయింది.రోటీన్ రొట్ట కథలతో సినిమాలను తెరకెక్కిస్తే సక్సెస్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే డిఫరెంట్ అటెంప్ట్ లతో చాలామంది వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా పీరియాడికల్ డ్రామా సినిమాలను తెరకెక్కించే పనిలో దర్శకులు చాలా బిజీగా కొనసాగుతున్నారు. మరి మొత్తానికైతే వాళ్ళు చేసిన సినిమాలన్నింటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రతి అటెంప్ట్ వెనుక ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం వాళ్లు చేసే సినిమాలు ప్లాప్ అవ్వడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. ఇప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సత్యం సుందరం సినిమా ఒక డీసెంట్ క్లాసికల్ హిట్ గా మిగిలిపోయింది. తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా విశేషంగా అలరిస్తుంది.
కొంచెం స్లో నరేశన్ తో సాగినప్పటికి బంధాలు బంధుత్వాల మధ్య కొనసాగే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ సత్యం సుందరం సినిమా దేవర సినిమాను డామినేట్ చేసి మరి భారీ వసూళ్లను రాబడుతుందంటే ఆ సినిమాలోని కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే తమిళ్ సినిమా లాంటివి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా రావాలని చాలామంది సినీ విమర్శకులు సైతం మన దర్శకులను హెచ్చరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మన వాళ్ళు చేసే గుడ్ అటెంప్ట్ లతో పాటు ఇలాంటి ఒక క్లాసికల్ హిట్ సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తే అన్ని రకాల సినిమాలను తెలుగు దర్శకులు పాన్ ఇండియాలోకి తీసుకు రాగలరు అనే ఒక నమ్మకమైతే సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగాలంటే మాత్రం అన్ని జానర్లల్లో సినిమాలు చేసి అన్ని సినిమాలకు సమానమైన ప్రాధాన్యతని ఇస్తూ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తమిళంలో వస్తున్న డిఫరెంట్ కథల మాదిరిగానే మనవాళ్లు డిఫరెంట్ గా ప్రయత్నం చేసి సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది…