https://oktelugu.com/

Pushpa 2 Movie : ‘పుష్ప 2:ది రూల్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు రాబట్టాలో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

రోజులు గడిచే కొద్దీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2 : ది రూల్' పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. 'పుష్ప' వంటి పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడంతో ఈ సినిమాకి కేవలం తెలుగు మార్కెట్ లోనే కాదు, ఇతర మర్కెట్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 09:18 PM IST
    Follow us on

    Pushpa 2 Movie : రోజులు గడిచే కొద్దీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2 : ది రూల్’ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ‘పుష్ప’ వంటి పాన్ ఇండియన్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడంతో ఈ సినిమాకి కేవలం తెలుగు మార్కెట్ లోనే కాదు, ఇతర మర్కెట్స్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డిసెంబర్ 6 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ డిసెంబర్ 6వ తేదీన బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విక్కీ కౌశల్ ‘చావా’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. కాబట్టి మొదటి రోజు బాలీవుడ్ లో భారీ షోస్, థియేటర్స్ ‘పుష్ప 2’ కి లేనందున ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుకు, అనగా డిసెంబర్ 5వ తారీఖున విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

    త్వరలోనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయం లో నిర్మాతలు బయ్యర్స్ కి పట్టపగలే చుక్కలు చూపించే రేంజ్ రేట్స్ చెప్తున్నారట. కేవలం తెలుగు రాష్ట్రాలకు గానూ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్స్ ని 180 కోట్ల రూపాయలకు పైగా అడుగుతున్నారట. ఇది చిన్న రేట్ కాదు. ఇటీవల విడుదలైన ‘దేవర’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 110 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండిటి మధ్య ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇక ఓవర్సీస్ లోని కేవలం నార్త్ అమెరికా స్టేట్ కి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 మిలియన్ డాలర్లకు జరిగిందట. #RRR మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ కూడా అంత రాకపోవడం గమనార్హం. 15 మిలియన్ డాలర్లు అంటే 120 కోట్ల రూపాయిల పైమాటే. ఓవర్సీస్ మొత్తానికి కలిపి 150 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇలా కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు + ఓవర్సీస్ కి కలిపి 330 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ అక్షరాలా 250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

    మొత్తం మీద ఇక్కడితో 580 కోట్ల రూపాయిలు అయ్యింది. అలాగే తమిళ్, కన్నడ, మలయాళం వెర్షన్స్ లో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆ భాషలకు కలిపి మరో 70 కోట్ల రూపాయిలు, మొత్తం మీద కేవలం థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు 650 కోట్ల రూపాయలకు పలుకుతుందని సమాచారం. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని పొందాలంటే కచ్చితంగా 650 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను దాటాల్సిందే. 650 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలంటే కచ్చితంగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాల్సిందే. చూడాలి మరి ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందా లేదా అనేది.

    Tags