https://oktelugu.com/

ఊపిరి ఆడలేదు.. నాగబాబు హాట్ కామెంట్స్

కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ అంటుకుంటోంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది పరిస్థితి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్, రాజమౌళి సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు. Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా? ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2020 / 01:19 PM IST
    Follow us on

    కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ అంటుకుంటోంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది పరిస్థితి. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్, రాజమౌళి సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు.

    Also Read: మెగా సినిమా: చిరంజీవి-దిల్ రాజు కాంబో సెట్టయిందా?

    ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడ్డారు. కరోనాతో పోరాడి చివరికి విజయం సాధించారు. అయితే.. కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో వెల్లడించారు. ‘కరోనాను జయించిన యోధుడిని అని చెప్పుకోవడం నాకిష్టం లేదు. అంటువ్యాధి నుంచి కోలుకున్న ఓ రోగిని మాత్రమే. ఆస్తమా ఉన్న కారణంగా ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో కంగారు పడ్డా. వెంటనే చికిత్స కోసం ఓ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చేరిన. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బంది పడ్డాను’ అని చెప్పుకొచ్చారు.

    వాటితోపాటు.. ‘మూడో రోజు వాస గుర్తించే లక్షణాన్ని కోల్పోయా. వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడిన తర్వాత కొన్ని రోజులకు కరోనా లక్షణాలు తగ్గాయి. దీంతో డాక్టర్లు నన్ను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి చేశారు. ఇంటికి వచ్చాక మరో వారం రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నా. నేను ఇంటికి వచ్చే సమయానికి నా భార్య పద్మజకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరం క్వారంటైన్‌లో ఉన్నాం’ అని వెల్లడించారు.

    Also Read: నానికి ఇంకో హీరోయిన్ కావలెను

    ‘ఇది మాకు కఠినకరమైన సమయమే. అయినప్పటికీ ధైర్యంగా ఉండిపోయాం. నా భార్య నాకంటే ఆరోగ్యవంతురాలు. అందుకే తను తొందరగా కోలుకోగలిగింది. అయితే.. సాధారణ జీవితంలోకి రావడానికి నాకు కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. ఒకవేళ మీలో ఎవరికైనా కరోనాకు సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోండి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి’ అంటూ సూచించారు.