Sunishith: రామ్ చరణ్ ఫ్యాన్స్ చితకొట్టిన సునిశిత్ ఇంత పెద్ద మేధావా? ఎందుకు ఇలా అయ్యాడు?

ఇటీవల రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మీద అనుచిత కామెంట్స్ చేశాడు. ఉపాసన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో నేను గోవా ట్రిప్ కి వెళ్ళాను. రామ్ చరణ్ కూడా నాకు మిత్రుడే. ఉపాసనను లవ్ లో దింపాలని నాకు చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Written By: Shiva, Updated On : May 15, 2023 8:59 am

Sunishith

Follow us on

Sunishith: సోషల్ మీడియా పుణ్యమా అని అతి సామాన్యులు సెలబ్రిటీలుగా మారారు. కొందరు తమ టాలెంట్ తో స్టార్స్ కాగా మరికొందరు కాంట్రవర్సీతో అయ్యారు. సునిశిత్ అలాంటివాడే. సాక్రిఫైజింగ్ స్టార్ గా సునిశిత్ పాపులర్ అయ్యారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో సునిశిత్ సంచలన కామెంట్స్ చేస్తుంటాడు. స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నేనే హీరో, కాకపోతే మధ్యలో తీసేశారని చెబుతుంటాడు. మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ నన్ను బ్రతిమిలాడితే వాళ్లకు ఆ సినిమాలు వదిలేశానని చెబుతాడు. ఆ విధంగా సునిశిత్ కి సాక్రిఫైజింగ్ స్టార్ అని పేరు వచ్చింది.

అంతటితో ఇతడు ఆగడు. స్టార్ హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపానని చెబుతాడు. కాజల్, తమన్నా కూడా తనతో డేటింగ్ చేశాడంటాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని అయితే రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమెతో నాకు పెళ్లి జరిగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. లావణ్య ఈ మేటర్ సీరియస్ గా తీసుకొని కేసు పెట్టింది. దాంతో సునిశిత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

ఇటీవల రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మీద అనుచిత కామెంట్స్ చేశాడు. ఉపాసన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో నేను గోవా ట్రిప్ కి వెళ్ళాను. రామ్ చరణ్ కూడా నాకు మిత్రుడే. ఉపాసనను లవ్ లో దింపాలని నాకు చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్స్… సునిశిత్ కి దేహశుద్ధి చేశారు. మీడియా ముందు క్షమాపణలు చెప్పించారు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని సునిశిత్ చెప్పారు. అసలు నోటికి వచ్చింది చెప్పేస్తున్న సునిశిత్ ఎవడో పిచ్చోడు, ఆకతాయి అనుకుంటే పొరపాటే.

అతడి బ్యాక్ గ్రౌండ్ చాలా ఉన్నతంగా ఉంది. సునిశిత్ మంచి ఎడ్యుకేటర్. వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ నందు బీటెక్ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్స్ విభాగంలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ చేశాడు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులలో మూడు పేపర్స్ ప్రెజెంట్ చేశాడు. ఇతడు మేధావి అని తెలుస్తుంది. అంత చదువుకున్న, టాలెంట్ ఉన్న సునిశిత్ మానసిక అనారోగ్యం కారణంగానే ఇలా చేస్తున్నాడని కొందరు భావిస్తున్నారు.