Salaar Movie Postponement
Salaar Movie Postponement: ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో అత్యంత హైప్ మధ్య విడుదలవుతుంది సలార్. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అందుకు ప్రధాన కారణం. ప్రభాస్ వంటి మాస్ హీరోని ఆయన ఎలా ప్రెజెంట్ చేయనున్నారనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఇక హీరోయిజం వేరే లెవల్లో చూపించడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. కెజిఎఫ్ చిత్రాలతో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశారు. దీంతో సలార్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా సెప్టెంబర్ 28 విడుదల తేదీగా ప్రకటించారు.
రిలీజ్ కి నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. సలార్ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అసలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందా లేదా? చెప్పిన ప్రకారం విడుదల చేస్తున్నారా లేదా? అనే సందేహాలు ఉన్నాయి. సలార్ ప్రమోషన్స్ మొదలుపెట్టక పోవడంతో మూవీ వాయిదా పడనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. మూవీపై నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోగా మేకర్స్ స్పందించారు. దీనిపై వివరణ ఇచ్చారు. సలార్ మూవీ ఎట్టిపరిస్థితుల్లో వాయిదా పడదు. చెప్పిన తేదీకి విడుదల చేస్తాము. ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
ఈ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపించింది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వి రాజ్ విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే జగపతి బాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ విడుదలకు సిద్ధం అవుతుంది. జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ రాముడు పాత్ర చేస్తున్నారు. ఈ పౌరాణిక గాథ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
టీజర్ విమర్శలు ఎదుర్కోగా… ట్రైలర్ మెప్పించింది. ఆదిపురుష్ విజయంపై యూనిట్ విశ్వాసంతో ఉన్నారు. అలాగే ప్రభాస్ మరో రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చేస్తున్నారు. అశ్వినీ దత్ రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు.