Bigg Boss 7 Telugu : గత సీజన్లలో ఓట్లకు, ఎలిమినేషన్ కు అస్సలు సంబంధం ఉండేది కాదు. హౌస్ లో యాక్టివ్ గా జోష్ గా ఉండేవారినే ఎలిమినేట్ చేసేసి చప్పడి ఫేసులను ఉంచుకునేవారు. కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్లా అని చెప్పిన నాగార్జున ఆ మేరకు ఎలిమినేషన్లలోనూ కాస్త నీతి నిజాయితీనే పాటిస్తున్నట్టు తొలి వారం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
ఈ వారం ఓటింగ్ చూస్తే.. అత్యధికంగా రతిక, గౌతమ్ కృష్ణలకు ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత దామిని ఉంది.. ఇక నెక్ట్ పల్లవి ప్రశాంత్, షకీలా, శోభాశెట్టి, ప్రిన్స్ యవార్ ఉన్నారు. చివర్లో కిరణ్ రాథోడ్ ఉంది. అందుకే అన్నట్టుగానే ఆమె ఎలిమినేట్ అయిపోయారు.
తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు రాని వారిని ప్రవేశపెట్టడమే తప్పు. వారు హిందీలో, ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే కింద తెలుగులో స్క్రోలింగ్ వేయడం ఈ ఏడు సీజన్లలో చూడలేదు. కానీ ఈసారి ఇదేం దరిద్రమో కానీ తెలుగు రాని వారు అయిన కిరణ్ రాథోడ్, యావత్ లాంటి వారిని హౌస్ లోకి పంపించారు. వారిని తెలుగు నేర్చుకోవాలని నాగార్జున ఆదేశించారు.
అయితే కిరణ్ రాథోడ్ కు తెలుగు రాక హిందీలో మాట్లాడడం.. ఆ హిందీలో ఆమె ఏం అంటుందో అర్థం కాకపోవడంతో ప్రేక్షకులు ఈవారం ఆమెనే ఎలిమినేట్ చేశారు. చివర్లో ఉన్నది ఇద్దరూ తెలుగు రాని యావత్, కిరణ్ లే కావడం గమనార్హం. వీరి భాష, వ్యవహారశైలి కూడా ఎవరికీ అర్థం కాలేదు.
ప్రేక్షకులు కూడా ఈ తెలుగు రాని జనాలకే తక్కువ ఓట్లు వేశారు. బయటకు పంపారు. బిగ్ బాస్ లో ఈ వారం ఊహించినట్టే జరిగింది. బయట ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ లో ఎలిమినేషన్ జరిగింది. భాష రాని కిరణ్ రాథోడ్ నే ప్రేక్షకులు, బిగ్ బాస్ కలిసి తొలి వారం హౌస్ నుంచి బయటకు పంపేశారు.
అయితే ఈవారం మరికొంతమంది సెలబ్రెటీలను హౌస్ లోకి పంపిస్తున్నారని.. వచ్చేవారం మరో ఇద్దరినీ సాగనంపేసి కొత్త వారిని దింపుతున్నారని సమాచారం. ఎవరి సీట్లు కన్ఫమ్ కాకపోవడంతోనే ఎంటర్ టైన్ మెంట్ చేయని వారిని సాగనంపి కొత్త వాళ్లను దించుతున్నట్టు తెలుస్తోంది.