F3 Venkatesh Remuneration: 2019 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా వెంకటేష్ – వరుణ్ తేజ్ F2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామ మరియు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలతో పోటీ కి దిగి భారీ విజయం సాధించడమే కాకుండా థియేట్రికల్ గా 83 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అప్పట్లో ఈ స్థాయి వసూళ్లు నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు అనే చెప్పొచ్చు..అంతటి సెన్సేషన్ సృష్టించిన సినిమాకి సీక్వెల్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దానికి మించిన రెట్టింపు కామెడీ తో ఈ నెల 27 వ తారీఖున F3 సినిమా ని మన ముందుకి తీసుకొని రాబోతున్నాడు ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి..ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవ్వబోతుండడం తో ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఆ చిత్ర యూనిట్.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..అదేమిటి అంటే ఒక్కో సినిమాకి సగటున 7 కోట్ల రూపాయిలు పారితోషికంగా తీసుకునే వెంకటేష్,ఈ సినిమాకి ఏకంగా మూడు రేట్లు అధిక పారితోషికం, అంటే అక్షరాలా 21 కోట్ల రూపాయిలు తీసుకున్నాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త..ఇంతమొత్తం వెంకటేష్ డిమాండ్ చెయ్యడానికి కూడా కారణం లేకపోలేదు..ఎందుకంటే F2 సినిమాకి ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ లో క్యూర్ కట్టడానికి కారణం వెంకటేష్ గారే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..వెంకటేష్ సినిమాకి టాక్ వస్తే లాంగ్ రన్ ఊహాతీతం గా ఉంటుంది అని ట్రేడ్ పండితులు ఎప్పుడు అంటూ ఉంటారు..వాళ్ళు అన్న ఆ మాటలకు నిదర్శనమే F2 మూవీ వసూళ్లు..అలాంటి మూవీ కి సీక్వెల్ కాబట్టే వెంకటేష్ ఆ ప్రాజెక్ట్ కి తగ్గట్టుగానే అంత మొత్తం పారితోషికం పుచుకున్నాడు అని ఇప్పుడు ఇండస్ట్రీ లో లేటెస్ట్ హాట్ టాపిక్ గా సాగుతున్న చర్చ..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 65 కోట్ల రూపాయలకు జరిగింది..వరుసగా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయినా తర్వాత వస్తున్న ఈ మూవీ కి జనాలు మళ్ళీ కదలాలి అంటే టాక్ ఒక్క రేంజ్ లో రావాలి..మంచి టాక్ వస్తే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది..లేకపోతే భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ దగ్గర ఆగుతుందో అనేది.
[…] […]