Chiranjeevi R. Narayanamurthy: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన సినిమా వస్తుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది..యూత్ ,మాస్, క్లాస్ మరియు ఫామిలీ ఆడియన్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చిరంజీవి సినిమాకి ఇప్పటికి కూడా కదులుతారు..అందుకే మెగాస్టార్ సినిమా వస్తుంది అంటే ఆయనతో పోటీ పడేందుకు దర్శక నిర్మాతలు సాహసించరు..ఆయన తోటి స్టార్ హీరోలు కూడా చిరంజీవి తో పోటీగా తమ సినిమాలను దీంపెందుకు ఆలోచిస్తారు..అలాంటిది చిరంజీవి సినిమాకి పోటీ గా తన సినిమాని దింపి ఆయన సినిమా మీద విజయం సాధించిన ఆర్.నారాయణ మూర్తి గారి సినిమా ఒక్కటి ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా..కానీ నమ్మాలి మరి!..ఎందుకంటే నిజంగా అది జరిగింది కాబట్టి..ఇంతకీ ఆ సినిమా ఏమిటి? మెగాస్టార్ తో పోటీ కి దిగి ఆయన సినిమా మీదనే బాక్స్ ఆఫీస్ దగ్గర గెలిచేంత సత్తా ఉన్న సినిమాని నారాయణమూర్తి తీసాడా..ఇంతకీ ఆ సినిమా ఏమిటి?, వంటి వివరాలు అన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు!.

Also Read: America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం.. ఎందుకీ ఉన్మాదం?
దర్శకరత్న దాసరి నారాయణ గారు తన సొంత నిర్మాణ సంస్థలో నారాయణ మూర్తి ని హీరో గా పెట్టి ‘ఒరేయ్ రిక్షా’ అనే పేరుతో ఒక్క సినిమాని తీశారు..ఎలాంటి అంచనాలు లేకుండా చాలా మూమూలుగా విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపించింది..కస్టపడి రిక్షా తొక్కుకుంటూ, ఆ వచ్చిన డబ్బులతో నారాయణ మూర్తి తన చెల్లెలు ని పోషించే పాత్ర లో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేసాడు..ఇక అదే రిక్షా కార్మికుడి బ్యాక్ డ్రాప్ తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామ కృష్ణ గారి దర్శకత్వం లో తెరకెక్కిన రిక్షా వోడు సినిమా కూడా నెల గాప్ లో విడుదల అయ్యి, అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే రిక్షా వోడు సినిమా థియేటర్స్ విడుదల అయ్యి వెళ్లిపోయిన కూడా ఒరేయ్ రిక్షా సినిమా థియేటర్స్ లో ఆడడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు,ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అని చెప్పడానికి..కంటెంట్ బలంగా ఉంటె ఎంత పెద్ద మెగాస్టార్ సినిమా పోటీకి వచ్చినా కంటెంట్ ఉన్న సినిమా ముందు తలవంచాల్సిందే అని నిరూపించిన సినిమా ఇది.

Also Read: Hardik Pandya : హార్ధిక్ పాండ్యానే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ నా?
Recommende Videos: