https://oktelugu.com/

Ram Charan: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్… ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

Ram Charan: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 26, 2021 / 05:33 PM IST
    Follow us on

    Ram Charan: టాలీవుడ్​తో పాటు ఇండియన్​ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది.

    ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలకు దాదాపు 50 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు దానిని డబుల్ చేశాడని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశాడని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్‌కి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేశాడంటూ వస్తున్న షాకింగ్ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

    ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్ కనిపించనుండగా.. తారక్​ కొమురం భీమ్​గా దర్శనమివ్వనున్నాడు. అజయ్​ దేవగణ్, శ్రియతో పాటు అలియా భట్​, ఒలివియా మోరిస్​ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.