https://oktelugu.com/

Kartika deepam : సౌందర్య.. డాక్టర్ బాబు వయసు తేడా తెలిస్తే.. షాకైపోవడం గ్యారంటీ!

తెలుగు రాష్ట్రాల్లో.. కార్తీక దీపం సీరియ‌ల్ గురించి తెలియ‌ని టీవీ ప్రేక్ష‌కులు లేరంటే.. అతిశ‌యోక్తి కానేకాదు. వంట‌ల‌క్క‌-డాక్ట‌ర్ బాబు ఎమోష‌న్ తో పూర్తిగా క‌నెక్ట్ అయిపోయిన ప్రేక్ష‌కులు.. ఆ సీరియ‌ల్ లోని న‌టుల‌ను త‌మ ఇంట్లో భాగం చేసుకున్నారు. జ‌నాలు రోజంతా ఎక్కడున్నా.. సాయంత్రం కార్తీక దీపం సీరియ‌ల్ టైమ్ అయ్యిందంటే.. టీవీ ముందు కూర్చోవాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ ఏ ఛాన‌ల్ చూస్తున్నా.. రిమోట్ లో టీవీ ఛాన‌ల్‌ నంబ‌ర్ మారాల్సిందే. అంత‌లా.. ఆడియ‌న్స్ మ‌న‌సు దోచుకుందీ […]

Written By:
  • Rocky
  • , Updated On : September 1, 2021 / 11:51 AM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాల్లో.. కార్తీక దీపం సీరియ‌ల్ గురించి తెలియ‌ని టీవీ ప్రేక్ష‌కులు లేరంటే.. అతిశ‌యోక్తి కానేకాదు. వంట‌ల‌క్క‌-డాక్ట‌ర్ బాబు ఎమోష‌న్ తో పూర్తిగా క‌నెక్ట్ అయిపోయిన ప్రేక్ష‌కులు.. ఆ సీరియ‌ల్ లోని న‌టుల‌ను త‌మ ఇంట్లో భాగం చేసుకున్నారు. జ‌నాలు రోజంతా ఎక్కడున్నా.. సాయంత్రం కార్తీక దీపం సీరియ‌ల్ టైమ్ అయ్యిందంటే.. టీవీ ముందు కూర్చోవాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ ఏ ఛాన‌ల్ చూస్తున్నా.. రిమోట్ లో టీవీ ఛాన‌ల్‌ నంబ‌ర్ మారాల్సిందే. అంత‌లా.. ఆడియ‌న్స్ మ‌న‌సు దోచుకుందీ సీరియ‌ల్‌.

    అయితే.. ఈ సీరియ‌ల్ లోని న‌టుల వ్య‌క్తిగ‌త జీవితం గురించి తెలుసుకోవ‌డానికి ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆస‌క్తి చూపిస్తుంటారు. అలాంటి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఇప్పుడు మీ ముందుకు తెచ్చాం. ఈ సీరియ‌ల్ లో డాక్ట‌ర్ బాబుగా న‌టిస్తున్న కార్తీక్ అస‌లు పేరు నిరుప‌మ్. అత‌నికి త‌ల్లిగా న‌టిస్తున్న సౌంద‌ర్య పేరు అర్చ‌న అనంత్‌. వీళ్లిద్ద‌రూ క్యారెక్ట‌ర్ల‌కు ఎంత బాగా సెట్ట‌య్యారంటే.. వీరిద్ద‌రూ నిజ‌మైన త‌ల్లీకొడుకుల్లాగానే ఉంటారు.

    ఓ వైపు ఐర‌న్ లేడీగా రాజ‌సం ఒలికిస్తూనే.. మాతృత్వాన్ని కూడా అద్భుతంగా ప‌లికిస్తుంది అర్చ‌న అలియాస్ సౌంద‌ర్య‌. ఆ క‌ట్టూ బొట్టు కూడా సౌంద‌ర్య క్యారెక్ట‌ర్ స్తాయిని పెంచాయ‌నే చెప్పాలి. అయితే.. ఆమె వ‌య‌సు ఎంత ఉంటుంది? డాక్టర్ బాబుకన్నా సౌందర్య వయసు ఎంత ఎక్కువ‌గా ఉండొచ్చు? అన్న‌ప్పుడు ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతారు. క‌నీసం ఓ ప‌ది, ప‌దిహేనేళ్ల తేడా అయినా ఉండొచ్చు అని అనుకుంటారు.

    కానీ.. వారిద్ద‌రి మ‌ధ్య వ‌య‌సులో ఎంత తేడా ఉందో తెలిస్తే మాత్రం.. ప్ర‌తి ఒక్క‌రూ ఖ‌చ్చితంగా ఖంగుతిన‌డం గ్యారంటీ. అవును మ‌రీ.. వారి మ‌ధ్య వ‌య‌సులో ఉన్న తేడా అలాంటిది. నిరుప‌మ్ క‌న్నా అర్చ‌న వ‌య‌సు 10 ఎక్కువ‌. అయితే.. 10 అంటే సంవ‌త్స‌రాలు కాదు.. నెల‌లు మాత్ర‌మే! అవును.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య వయ‌సు తేడా కేవ‌లం ప‌ది నెల‌లే! వీరిద్ద‌రూ ఒకే సంవ‌త్స‌రంలో జ‌న్మించారు.

    1988వ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 3న అర్చ‌న జ‌న్మించ‌గా.. ఇదే సంవ‌త్స‌రం చివ‌ర్లో నిరుప‌మ్ జ‌న్మించాడు. ఈ విధంగా.. కేవ‌లం నెల‌ల గ్యాప్ మాత్ర‌మే ఉన్న వీరిద్ద‌రూ త‌ల్లీ కొడుకుల్లా న‌టించ‌డం.. అది కూడా అంద‌రూ ఆమోదించే విధంగా స‌రిగ్గా స‌రిపోవ‌డం ఖ‌చ్చితంగా విశేష‌మే క‌దా? ఈ విష‌యం తెలిసిన వారంతా.. మీలాగ‌నే అవాక్కైపోతున్నారు! ఈ న్యూస్ నిజంగా.. చిన్న‌పాటి షాకే క‌దా?!