Game Changer Dhop Song: మరో 22 రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమన్ స్వరపర్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ పాటల్లోనూ తమన్ మార్క్ కాకుండా, శంకర్ మార్క్ కనిపించింది. ఆయన పాత సినిమాల్లో ఉండే సౌండింగ్ ఈ సినిమా పాటల్లో కనిపించాయి. టీజర్ లో కూడా శంకర్ మార్క్ రీ మిక్స్, సౌండింగ్ కనిపించింది కానీ, తమన్ మార్క్ కనిపించలేదు. సినిమా అడుగడుగునా వింటేజ్ శంకర్ కనిపించేలా తీర్చిదిద్దినట్టు ఇప్పటి వరకు విడుదలైన టీజర్, సాంగ్స్ ని చూస్తే అర్థం అవుతుంది. కాసేపటి క్రితమే ఈ సినిమాలోని నాల్గవ పాటకి సంబంధించిన ప్రోమో వీడియో ని విడుదల చేశారు.
దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శంకర్ సినిమాల్లోని పాటల చిత్రీకరణ ఒక సరికొత్త ఊహాలోకం లోకి మన ప్రేక్షకులను తీసుకెళ్తుంది. అయితే ఈమధ్య కాలంలో శంకర్ సినిమాల్లో ఈ మార్క్ మిస్ అవుతూ వచ్చింది. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం లో మాత్రం ప్రతీ పాట ఒక విజువల్ వండర్ లాగా అనిపించింది. ఈరోజు విడుదలైన ‘డోప్’ వీడియో సాంగ్ ప్రోమో కి కూడా అలాంటి అనుభూతి కలిగించింది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ఒక ఎత్తు, ఈ పాటకు తమన్ డిజైన్ చేసిన సౌండింగ్ ప్రోగ్రాం మరొక ఎత్తు. కేవలం సౌండ్ పరంగా మాత్రమే కాకుండా, విజువల్ గా ఆర్టిఫీషియల్ శబ్ద లోకాన్ని శంకర్ తన విజన్ తో చిత్రీకరించాడు. సాంగ్ లో డ్యాన్స్ స్టెప్పులు కూడా వింటేజ్ రామ్ చరణ్ మార్క్ కనిపించింది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.
తమన్ ఈ పాట గురించి ఎంతో ఉత్సాహం చూపుతూ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్లు వేసాడు. ఆ ఉత్సాహానికి తగ్గట్టుగానే ఈ పాట అదిరిపోయింది. ఈ నెల 22వ తారీఖున ఈ పాటని విడుదల చేయబోతున్నారట. 21 వ తారీఖున డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఈ పాటని విడుదల చేస్తారట. అమెరికా లో 21 వ తేదీ అంటే మన ఇండియా 22 అన్నమాట. ఇదంతా పక్కన పెడితే ‘డోప్’ అనే సౌండింగ్ కి ఎదో ఒక ప్రత్యేకత ఉందని తెలుస్తుంది. ఎందుకంటే టీజర్ లో ఈ ‘డోప్’ అనే పదం పదే పదే మనకి వినిపిస్తూ ఉంటుంది. దాని ప్రత్యేకత ఏమిటి అనేది సినిమా చూసే వరకు మనకి అర్థం కాదు. ఈ నెల 29 వ తారీఖున థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్, దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.