https://oktelugu.com/

Samantha and Shobhita : సమంత పై పగబట్టేసిన శోభిత..చివరి జ్ఞాపకాలు కూడా మిగలకుండా చేసిందిగా!

అక్కినేని నాగ చైతన్య ఇటీవలే శోభిత దూళిపాళ్ల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా, హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వివాహం జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 10, 2025 / 07:47 AM IST

    Samantha , Shobhita

    Follow us on

    Samantha and Shobhita : అక్కినేని నాగ చైతన్య ఇటీవలే శోభిత దూళిపాళ్ల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా, హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వివాహం జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులు మొత్తం శోభిత తమ ఇంటికి రావడం పై ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసారు. ఈ ఇల్లు గతం లో నాగచైతన్య, సమంత ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లు అని సోషల్ మీడియాలో దీనిపై ఎన్నో కథనాలు చూసాము. కొద్దిరోజులకు ఇల్లు పూర్తిగా సిద్ధం అయిపోతుంది, గృహ ప్రవేశం చేయాలి అని అనుకుంటున్న రోజుల్లో వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త పెద్ద దుమారం రేపింది. ఆ వార్తలకు తగ్గట్టుగానే కొన్నాళ్ళకు వీళ్ళు విడాకులు తీసుకున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత శోభిత సమంత కి సంబంధించి ఏ చిన్న జ్ఞాపకం ఉన్నా చెరిపేయాలని బలంగా నిర్ణయం తీసుకుందట. అందులో భాగంగా ఒకప్పుడు సమంత తో పాటు నాగ చైతన్య కూడా ఎంతో అపురూపంగా చూసుకునే కొన్ని జ్ఞాపకాలకు శోభిత చెరిపివేసింది. సమంత ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న గ్రీన్ గార్డెన్ ని శోభిత తొలగింపచేసిందని సమాచారం. సమంత కి గ్రీనరీ అంటే ఎంతో ప్రాణమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగ చైతన్య తో కలిసి ఉన్నన్ని రోజులు ఆమె గార్డెన్ లో ఉన్న ఫోటోలని ఎక్కువగా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉండేది. గ్రీనరీ ని ఇష్టపడని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఆ పచ్చదనం లో ఉండాలని కోరుకుంటారు. అలాంటిది శోభిత అసూయ తో ఎందుకు ఇంత పని చేసింది. సమంత అంటే ఆమెకి ఇంత ద్వేషమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే ఈమె టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని హాట్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అవి చూస్తే ఈమెని అక్కినేని ఫ్యామిలీ ఎలా అంగీకరించింది అనుకుంటారు. అంతటి హాట్ సన్నివేశాల్లో నటించింది ఈమె. తెలుగు, తమిళం భాషల్లో ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. ఓవరాల్ గా డైరెక్ట్ తెలుగు లో ఈమె గూఢచారి, మేజర్ చిత్రాల్లో మాత్రమే కనిపించింది. నాగ చైతన్య విషయానికి వస్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న ఈయన ఇప్పుడు ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ చిత్రం లో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల కాబోతుంది.