https://oktelugu.com/

Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు’ లో గ్రాఫిక్స్ కోసం ఇంత ఖర్చు చేశారా..? ఆ డబ్బులతో మరో పెద్ద సినిమా తియ్యొచ్చు!

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా దాదాపుగా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 10, 2025 / 07:42 AM IST

    Hari Hara Veeramallu

    Follow us on

    Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం లో మొదలైన ఈ సినిమా దాదాపుగా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం వారం రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కి సంబంధించిన కొన్ని షాట్స్ బ్యాలన్స్ ఉన్నాయి. అవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీన్స్ కావడంతో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి సిద్ధంగా ఉన్నప్పటికీ, అనుపమ్ ఖేర్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ షెడ్యూల్ కాస్త వాయిదా పడింది. ఈ నెలలోనే పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అవేంటో ఒకసారి వివరంగా ఈ స్టోరీ లో చూద్దాం.

    ఈ సినిమాలోని VFX షాట్స్ కోసం మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అవి చూసేందుకు రియల్ గా ఉండడానికి ప్రపంచం లోని టాప్ మోస్ట్ VFX కంపీనాలలో గ్రాఫిక్స్ వర్క్ చెయ్యిస్తున్నారట. సినిమాలో అత్యంత కీలంగా ఉండే మచిలీపట్టణం పోర్ట్ సీన్ VFX వర్క్ ని ఇరాన్ లో పూర్తి చేశారట. ఔట్పుట్ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పులి తో పోరాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశానికి సంబంధించిన VFX వర్క్ ని కెనెడా లో, కుస్తీ ఫైట్ ని బెంగళూరులో చేయించారట. అదే విధంగా చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ కి సంబంధించిన VFX వర్క్ ని హైదరాబాద్ లోనే చేయించారట. గతంలో ఈ కంపెనీ లో కల్కి, బాహుబలి వంటి సినిమాలకు సంబంధించిన VFX షాట్స్ వర్క్స్ జరిగినట్టు తెలుస్తుంది.

    ఈ VFX విభాగం మొత్తాన్ని మనోజ్ పరమహంస అదే విధంగా ప్రముఖ హాలీవుడ్ VFX సూపర్వైజర్ బెన్ లాక్ సారథ్యం లో పర్యవేక్షిస్తున్నారట. బెన్ లాక్ గతం లో హాలీవుడ్ లో తెరకెక్కిన ఆక్వామెన్ వంటి సంచలనాత్మక చిత్రాలకు పని చేసాడు. అంతే కాకుండా ఈ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ కూడా హాలీవుడ్ కి చెందిన వాళ్ళే అవ్వడం గమనించాల్సిన విషయం. ప్రొడక్షన్ విషయం లో ఎక్కడా రాజీ లేకుండా చాలా పకడ్బందీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలు కేవలం ఒక్క శాతం మాత్రమేనని, సినిమాలోని గ్రాండియర్ కి సంబంధించిన ప్రోమో టీజర్లు త్వరలో విడుదల చేస్తామని, అవి చూసిన తర్వాత తమ సినిమా ఎంత పెద్దది అనేది మీకే అర్థం అవుతుంది అంటూ నిర్మాత ఏఎం రత్నం చెప్పుకొచ్చాడు. ఇకపోతే జనవరి ఆరవ తేదీన విడుదల అవ్వాల్సిన ఈ చిత్రంలోని ‘మాట వినాలి’ లిరికల్ వీడియో సాంగ్ ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ పాటని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.