Renu Desai : చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘నీతోనే డ్యాన్స్’ అనే షో ఇచ్చిన సంగతి తెలిసిందే. జానీ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు ఆడియన్స్ కి కనిపించింది ఈ షో ద్వారానే. ఈ షో పెద్ద హిట్ అయ్యింది, మూడు సీజన్స్ ని కూడా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కి యాంకర్ గా ఉదయభాను వ్యవహరిస్తే, మిగిలిన సీజన్స్ కి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరించింది. అయితే మొదటి సీజన్ లో యాంకర్ ఉదయభాను ఒక ఎపిసోడ్ లో తన జీవితంలో చోటు చేసుకున్న ఒక మధురమైన జ్ఞాపకం ని పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాలయ్య అభిమానులు మళ్ళీ అప్లోడ్ చేసి వైరల్ చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి అంత అవసరం ఏముంది అంటే, బాలయ్య గురించే ఉదయభాను మాట్లాడింది కాబట్టి.
ఆమె మాట్లాడుతూ ‘ఒక రోజు నా కూతురు పుట్టిన రోజు కి బాలయ్య బాబు గారిని ఆహ్వానించాను. ఆయన ఎన్ని గంటలకు రావాలమ్మా? అని అడిగారు. నేను పలానా టైం అని చెప్పాను. అంత పెద్ద స్టార్ హీరో నా కూతురు పుట్టినరోజు కి ఎందుకు వస్తాడులే, కాకపోతే ఎదో చిన్న ఆశతో ఆహ్వానించాను అని మనసులో అనుకున్నాను. అయితే బాలయ్య గారు మరుసటి రోజు సరిగ్గా 7 గంటలకు ఒక నిమిషం అటు ఇటు కాకుండా వచ్చేసారు. ఎదో మాటవరుసకి టైం అడిగారు అనుకున్నాను. కానీ ఆయన గుర్తు పెట్టుకొని మరీ నా కూతురు పుట్టినరోజు కి విచ్చేసి మమ్మల్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసాడు. బాలయ్య గారి గొప్పతనం గురించి అప్పటి వరకు అందరూ చెప్తుంటే విన్నాను. కానీ ఆరోజే ప్రత్యక్షంగా చూసాను. ఆ మధుర క్షణాన్ని నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చాలా ఎమోషనల్ గా చెప్తుంది ఉదయ భాను.
ఆమె మాట్లాడిన మాటలకు రేణు దేశాయ్ కి కూడా కళ్ళలో నుండి నీళ్లు తిరిగేస్తాయి. రేణు దేశాయ్ కూడా బాలయ్య గొప్పతనం గురించి చెప్తూ, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను తల్చుకుంది. చూసేందుకు బాలయ్య చాలా రఫ్ గా కనిపిస్తాడు, అభిమానులను కోపమొస్తే కొడుతుంటాడు అని అందరూ అంటుంటారు కానీ, బాలయ్య చిన్న పిల్లల మనస్తత్వం అని, ఆయన చేతికి ఎముకలు ఉండవని, అందరికీ సహాయం చేస్తూనే ఉంటాడని ఇది వరకే చాలా మంది సెలెబ్రిటీలు చెప్పారు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య, ఈ సినిమాతో ఆ విజయ పరంపర ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.