https://oktelugu.com/

Shobha Shetty : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న శోభా శెట్టి..వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!

శోభా శెట్టి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటి సీజన్ చివరి దశకి వచ్చేసింది కదా, రోజు మనం లైవ్ చూస్తూనే ఉన్నాం, శోభా శెట్టి ఎప్పుడు హౌస్ లోకి వచ్చింది అని మీకు అనిపించొచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 07:51 PM IST

    Shobha Shetty

    Follow us on

    Shobha Shetty :  గత సీజన్ అతి పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరు శోభా శెట్టి. ఈమె నుండి ఎక్కువగా నెగటివ్ కంటెంట్ వచ్చింది కానీ, అది టీఆర్ఫీ రేటింగ్స్ ని బాగా తెచ్చిపెట్టింది కాబట్టి, ఒకటి రెండు వారాలు ఆమె ఎలిమినేట్ అయిపోయినా, చివరి వారం వరకు ఉంచారు అనేది అప్పట్లో పెద్దగా వినిపించిన టాక్. అయితే ఇప్పుడు ఆమె వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటి సీజన్ చివరి దశకి వచ్చేసింది కదా, రోజు మనం లైవ్ చూస్తూనే ఉన్నాం, శోభా శెట్టి ఎప్పుడు హౌస్ లోకి వచ్చింది అని మీకు అనిపించొచ్చు. కానీ ఆమె వచ్చింది మన తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కాదు, కన్నడలో కొన్ని వారాల క్రితమే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10 లో. ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

    ప్రస్తుత సీజన్ కూడా టాప్ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. అయితే షో కి కాస్త మరికొంత ఊపుని తీసుకొని రావడం కోసం నిన్న కొంతమంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. వారిలో శోభా శెట్టి కూడా ఉంది. తెలుగు బిగ్ బాస్ లో ఈమె ఉన్నన్ని రోజులు ఎలా అయితే గొడవలు పెట్టుకొని రచ్చ చేసిందో, అక్కడ కూడా అప్పుడే గొడవలు మొదలెట్టేసింది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో లో ఆమె కంటెస్టెంట్స్ తో గొడవ పడుతున్న తీరుని చూసి మన తెలుగు ఆడియన్స్ ‘ఈమెలో ఏ మార్పు రాలేదు’ అని ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈమెకి మన తెలుగు ఆడియన్స్ నుండి కూడా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. సీజన్ 7 లో రన్నర్ గా నిల్చిన అమర్ దీప్, అదే విధంగా టాప్ 5 లోకి వచ్చిన ప్రియాంక జైన్ ఈమెకు క్లోజ్ ఫ్రెండ్స్.

    కాబట్టి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వీళ్ళు శోభా శెట్టి కి ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేస్తే ఒక రేంజ్ లో ఆమెకి ఓట్లు పడుతాయి. అంతే కాదు ఈమె కన్నడ ఆడియన్స్ కి బాగా సుపరిచితురాలు. ఎంత నెగటివిటీ వచ్చినప్పటికీ కూడా, అన్ని వారాలు ఆమె తెలుగు బిగ్ బాస్ లో కొనసాగడానికి కారణం కన్నడ ఆడియన్స్ ఓట్లు కూడా తోడు అవ్వడం వల్లే అని చెప్పొచ్చు. మన ఆడియన్స్ కి ఈమె ‘కార్తీక దీపం’ సీరియల్ లో లేడీ విలన్ గా బాగా పరిచయమైంది. కన్నడ లో కూడా ఈమె అనేక సీరియల్స్ లో విలన్ గా నటించి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇలా సీరియల్స్ లో విలన్ గా చేసి, బయట కూడా అదే కోపం చూపిస్తూ మాట్లాడే వాళ్లకు ఎప్పుడూ నెగటివ్ గానే ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ లో శోభా గొడవ పాడినప్పుడు ఆమె తప్పు ఏమి లేకపోయినా కూడా నెగటివ్ అవ్వడానికి కారణాలలో ఇది కూడా ఒకటి. మరి దీనిని దాటుకొని ఆమె ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.