Shivathmika Rajashekar: తెల్లగౌను వేసుకున్న పెద్ద పాప అంటూ పాటలు పాడడమే కాదు.. ఆ పాటలోని అందమంతా కనిపించేలా సుందరాంగులు హోయలు ఒలుకుతారు. స్టార్ హీరో కూతురు అయ్యిండి.. పద్ధతి గల ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఈ అమ్ముడు అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది.

శివాత్మిక రాజశేఖర్.. విజయ్ దేవరకొడ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘దొరసాని’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే అందరి దృష్టిలో పడింది. నటిగా నూటికి నూరు మార్కులు కొట్టేసింది.
Also Read: Live in Relationship : అక్కడ పెళ్లికి ముందే నచ్చిన మగాడితో ఎంజాయ్ చేయవచ్చు..

ఇక ఇప్పుడు కొన్ని తెలుగు,తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఖాళీ టైంలో కొన్ని సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పంచుకుంది. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

శివాత్మిక హావభావాలు అదిరిపోయేలా ఉన్నాయంటూ ఆమె అందాలను ఆస్వాదిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినా శివాత్మక తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తండ’ మూవీలో నటిస్తోంది.

ఇక ఇటీవల ఓ వార్త కూడా కంగారుపెట్టింది. శివాత్మిక తన ప్రియుడితో దుబాయ్ లో చక్కర్లు కొడుతోందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అదేం లేదని స్వయంగా శివాత్మిక క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ వెళ్లలేదని.. తన తల్లిదండ్రులు జీవిత-రాజశేఖర్ తోనే దుబాయ్ వచ్చానంటూ ఓ ఫొటోను పంచుకొని ఈగాసిప్ లకు చెక్ పెట్టింది. ఇలాంటి రూమర్స్ వ్యాపింపచేయవద్దంటూ హితవు పలికింది.

View this post on Instagram
Also Read:Ram Charan: రామ్ చరణ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొరటాల శివ