Homeఆంధ్రప్రదేశ్‌Nellore court robbery case : కోర్టు దొంగలు దొరికారు.. ఒట్టి ఇనుప సామాను వాళ్లట.....

Nellore court robbery case : కోర్టు దొంగలు దొరికారు.. ఒట్టి ఇనుప సామాను వాళ్లట.. అచ్చం సినిమా స్టోరీ చెప్పారే!?

Nellore court robbery case : అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు.. ఏదైనా చిటికెలో మార్చేయవచ్చు. కొండ మీద కోతిని అయినా తీసుకురావచ్చు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మంత్రి అవ్వడంతో సొంత జిల్లాలో ఊపు ఊపేయవచ్చు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన ఆ ఘటన మాత్రం ఆ మంత్రిపై విమర్శలకు కారణమైంది. పోలీసులు తాజాగా ఆ దొంగతనంపై తేల్చిన విషయం చూస్తే అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

నెల్లూరు జిల్లా కోర్టులో దొంగతనం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఎందుకంటే ఇటీవలే కొత్త కేబినెట్ లో చోటు సంపాదించిన ఓ మంత్రికి సంబంధించిన కేసు పత్రాలు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లారు. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఇటీవల దొంగలు చొరబడ్డారు. ఓ బ్యాగును ఎత్తుకెళ్లి.. కోర్టు బయట ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు దానిని పరిశీలించగా.. అందులో పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ల్యాప్‌టాప్, 4 మొబైల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా భావిస్తున్నారు! ఇదే ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. తీవ్ర దుమారం రేపింది. ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి.

-అసలు ఈ కేసు ఏంటి?
మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017 డిసెంబరులో ఆరోపించారు. ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లని కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్‌ స్టేషన్ లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించిన పోలీసులు చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చివరికి రావడం.. పక్కాగా కాకాణికి శిక్ష పడుతుందన్న తరుణంలో ఆయన కేసు పత్రాలు కోర్టులో చోరీ కావడం చర్చనీయాంశమైంది.

తాజాగా కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఇప్పుడు ఆయన తన మార్కు రాజకీయానికి తెరలేపారు. మంత్రి అండ ఉంటుందన్న ధీమాతోనే ఆయన అనుచరులు కోర్టుకే కన్నం వేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో కాకాణికి శిక్ష పడే అవకాశం ఉన్నందునే ఆయనే వెనుక ఉండి పత్రాలు మాయం చేయించారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, హైకోర్టు ఈ చోరీ ఘటనపై చర్యలు తీసుకోవాలని, పత్రాలు అపహరించిన దొంగలను అరెస్ట్‌ చేయాలని, చోరీ వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టేశారన్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఇనుప సామాను ఎత్తుకెళ్లే చిల్లర దొంగలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర ఉన్న మెటీరియల్ ను దొంగతనం చేయడానికి వెళ్లి ఆ బిల్డింగ్ వెనుకల ఉన్న కోర్టులోకి వెళ్లి అందులోని ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లు , పత్రాలు తీసుకెళ్లిపోయారని .. మిగతావి అక్కడే పడేశారని పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు చిల్లర దొంగలను పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో నిందితులను పట్టుకున్న వైనం అందరినీ అనుమానాలకు గురిచేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 14 కేసుల్లో ఏ1గా ఉన్న ఒక చిల్లర దొంగను ఈ కేసులో నేరస్థుడిగా చూపించారని.. కోర్టు అని తెలిసి కూడా ఆ దొంగలు అక్కడే ఎందుకు దొంగతనం పాల్పడ్డారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

దొంగలిద్దరినీ అరెస్ట్ చేసి ల్యాప్ ట్యాప్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులను పోలీసులు రికవరీ చేశారు. లాజిక్ లేని వీరి దొంగతనంపై వివరణ ఇచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అచ్చం సినిమా కథలా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరినో తప్పించడానికే ఈ చిల్లర దొంగలను అరెస్ట్ చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

  1. […] Extramarital Affair: ఆమెకు ఓ వ్య‌క్తితో పెండ్లియింది. కానీ ఎందుకో భ‌ర్త‌తో సంతోషంగా ఉండ‌లేక‌పోయింది. చివ‌ర‌కు భ‌ర్త త‌మ్ముడిపై క‌న్నేసింది. కొడుకు లాంటి మ‌రిదితో వావి వ‌ర‌స‌లు మ‌రిచిపోయి అక్ర‌మ సంబంధానికి తెర‌లేపింది. మ‌రిదిని వ‌ల‌లో వేసుకుంది. ఇంకేముంది భ‌ర్త లేనప్పుడ‌ల్లా.. విచ్చ‌ల విడిగా ఎంజాయ్ చేయ‌సాగింది. ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌కుండా వ‌దిన‌, మ‌రిది జాగ్ర‌త్త ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చివ‌ర‌కు త‌న చెల్లెలు జీవితాన్ని కూడా నాశ‌నం చేసింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular