కమల్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే శృతి హాసన్ తన అందాలతో వెండితెర పై శృతిలయలు పలికించింది. పైగా తనలాంటి సినీ నేపథ్యం ఉన్న అమ్మాయిలకు ప్రేరణగా కూడా నిలిచింది. ఈ క్రమంలోనే ‘మెగా డాటర్ నిహారిక’ కూడా హీరోయిన్ గా ట్రై చేసింది. అలాగే మరో సీనియర్ హీరో జీవిత రాజశేఖర్‌ల ముద్దుల తనయ ‘శివానీ రాజశేఖర్’ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఆమె సినిమా ఇంకా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వకపోవడం ఆమె దురదృష్టం అనుకునేవాళ్లు ఇన్నాళ్లు. కానీ, శివానీకి గుడ్ టైం స్టార్ట్ అయినట్టు ఉంది. తెలుగులో ఆశించిన స్థాయిలో తనకు అవకాశాలు ఇవ్వడం లేదని గ్రహించిన శివానీ, మొత్తానికి తన రూట్ మార్చుకుని గత కొన్ని నెలలుగా తమిళ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలో ఈ బ్యూటీ తమిళంలో ఒక క్రేజీ ఛాన్స్ ను కొట్టేసింది. హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక సినిమా ‘ఆర్టికల్ 15’. ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. పైగా ఈ చిత్రంలో హీరో ఉదయనిధి స్టాలిన్. కాగా శివానీ ఈ సినిమాలో ఉదయనిధి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తమిళనాడు సీఎంగా ఎన్నికైన స్టాలిన్ కుమారుడితో, మొత్తానికి రాజశేఖర్ పెద్ద కుమార్తె హీరోయిన్ గా నటించబోతోంది అన్నమాట.