Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఫైనల్ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్ బాస్. ‘ ఫ్లోట్ ఆర్ సింక్ ‘అంటూ కొత్త టాస్క్ పెట్టారు. ఇందులో ఎవరి ఫోటో అయితే మునిగిపోతుందో వాళ్ళు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారు. చివరి వరకు మునిగిపోకుండా ఉన్న వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా కొనసాగుతారు అని బిగ్ బాస్ చెప్పారు. కెప్టెన్ అయ్యేందుకు అనర్హులు ఎవరో మీరే డిసైడ్ చేసి చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అమర్, శివాజీ ని అనర్హుడు అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నేను ఎందుకు అనర్హుడినో రీజన్ చెప్పమంటూ అమర్ ని నిలదీశాడు శివాజీ. దాంతో అమర్ ‘అన్న మీరు దగ్గరుండి ఆడించారు,మీ కన్నా కొంచెం ఎక్కువ కష్టపడి ఆడిన వారికి ఛాన్స్ దక్కాలని ఇలా చేస్తున్న’ అని చెప్పాడు అమర్.దీంతో శివాజీ ‘మీతో పాటు నేను కష్ట పడ్డాను కదా. అంటే నేను ఒక వేస్ట్ ఫెలో అనే గా అర్ధం’ అన్నాడు.
ఇక్కడ మానవత్వం,మంచితనం ఏమీ లేవు బిగ్ బాస్ అని శివాజీ అన్నాడు. ఇక అమర్, శివాజీ ఫోటో ని స్విమ్మింగ్ పూల్ లో ముంచేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాడు.దీంతో శివాజీ బాధ పడ్డారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ శివాజీ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. శివాజీ ఎలా ఉన్నారు అని అడిగారు.దాంతో శివాజీ చాలా ఇబ్బంది పడుతున్నా బిగ్ బాస్. చెయ్యి అంతా లాగేస్తుంది. ఎవ్వరు లేనప్పుడు ఏడుస్తున్నా.. అందరూ ఉన్నప్పుడు పైకి నవ్వుతూ లోపల ఏడుస్తున్నా బిగ్ బాస్.
గుండెల్లో బరువుగా ఉంది. వాళ్ళందరి ముందు ఏడవలేక పోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు శివాజీ. అన్నిటికంటే నాకు ఎందుకు బాధగా ఉందంటే ‘నేను గేమ్ ఆడటం లేదని ఇండైరెక్ట్ గా అంటున్నారు అని చెప్తూ కన్నీటి పర్యంతం అయ్యారు శివాజీ. శివాజీ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు కనిపిస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కలదు. శివాజీని పర్మినెంట్ గా బయటకు పంపే ఛాన్స్ ఉంది. గతంలో గంగవ్వ, నోయల్ లను బిగ్ బాస్ అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ కాకుండానే హౌస్ నుండి పంపేశాడు.
Shivaji’s heartfelt confession in the Bigg Boss Confession Room ️❤️Shivaji shares his pain and sincere emotions with Bigg Boss! #BiggBossTelugu7 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel https://t.co/UucyZVSzif
— Starmaa (@StarMaa) October 20, 2023