Amala Akkineni: పెళ్లి అవగానే కెమెరాకు దూరంగా జరిగింది అక్కినేని అమల. వైవాహిక జీవితం తర్వాత గ్లామర్ రోల్స్ చేయడం నచ్చలేదు కావచ్చు అని అంటారు నెటిజన్లు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమల ఒకే ఒక జీవితం సినిమాలో కీలక పాత్ర పోషించింది. అమల అభినయాన్ని ప్రేక్షకులు ఎంతగానో కీర్తించారు కూడా. అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచీ అమల మంచి వ్యక్తిగానే కాదు శక్తివంతమైన మహిళగా ముందుకుసాగుతోంది. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్డూడియో అధినేతగా కొనసాగుతున్నారు. ఇంతేకాదు ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా.. అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలుగా తన సాకారాన్ని అదిస్తుంది అమల. భర్త ఏ రంగంలో అయినా రాణించాలి అంటే భార్య సాకారం కచ్చితంగా అవసరం. అందుకే నాగార్జున ప్రతి విషయంలో పై చేయి సాధిస్తున్నారు అనేంతలా గొప్ప పేరు సంపాదించింది అమల. ఈమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అమల నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే అమల ఎప్పుడు కనిపించినా చాలా సింపుల్ గా కనిపిస్తుంటుంది. మెడలో బంగారం కూడా ఎక్కువగా కనిపించదు. మరీ దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆడవాళ్లకు షాపింగ్ అంటే ఇష్టం. ఇష్టం కాదు పిచ్చి అని చెప్పొచ్చు. ఇక కొత్త బట్టలు, నగలు అంటే మహా ప్రాణం. అందులో బంగారం అంటే చెవి కోసుకుంటారు. పెళ్లి, మరేదైనా ఫంక్షన్ ఉంటే బంగారానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విధంగానే చాలా మంది మహిళలు ఉంటారు. కానీ అమల మాత్రం చాలా సింపుల్ గా బంగారం వేసుకోకుండా కనిపిస్తుంటుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్దనా?
బంగారంతో కూడుకున్న నగలు ధరిస్తే చర్మానికి కొన్ని సమస్యలు వస్తాయని నమ్ముతారాట. ఈ రీజన్ వల్లే బంగారం ధరించడానికి ఆసక్తి చూపించడం లేదట. ఇక అమల మెడలో చాలా సార్లు కేవలం నల్లపూసల దండతో మాత్రమే కనిపిస్తుంది. నల్లపూసల దండ వేసుకోవడానికి మాత్రమే ఇష్టపడుతుందట.అయితే స్కిన్ పాడవుతుందనే నెపంతో అమల ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ చాలా మంది బంగారాన్ని ధరించడం ఆరోగ్యంగా భావిస్తారు. రింగులు, మంగళసూత్రం, మెట్టెలు ధరించడం వల్ల కొన్ని సమస్యలు రావని చెబుతుంటారు.
నాగార్జునతో కలిసి అమల చినబాబు, శివ, నిర్ణయం, ప్రేమయుద్దం వంటి చిత్రాలలో అలరించారు. నాగార్జున కెరీర్ ను పెద్ద మలుపు తిప్పిన శివ తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లోనూ అమల నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమైన అలరించాయి. తెరపై నాగార్జునకు విజయనాయికగా నిలచిన అమల, తరువాత జీవితనాయిక అయ్యారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అమల, నాగార్జున. వారి కుమారుడు అఖిల్ బాల్యంలోనే సిసింద్రీ గా నటించి ఆకట్టుకున్నాడు. సిసింద్రీ షూటింగ్ సమయంలో అమల తన తనయుడు అఖిల్ ను నటింప చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ తన దరిచేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉంటారు అమల. ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటించి మెప్పించింది. తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన మనంలోనూ ఆమె కాసేపు కనిపించారు. బుల్లితెరపైనా అమల కొన్ని సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం ఒకే ఒక జీవితం లో అమల అభినయానికి జనం జేజేలు పలుకుతున్నారు. భవిష్యత్తులోనూ తనకు ఇష్టమైన పాత్రల్లో నటించి, అమల మరింతగా అలరిస్తారని ఆశిద్దాం..