
Puneeth Rajkumar Funeral: కన్నడ సినీ పరిశ్రమలో శివ రాజ్ కుమార్ కు ఉక్కు మనిషి అని పేరు ఉంది. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో పరిష్కరించడంలో శివ రాజ్‌కుమార్ నేర్పరి. ఎంత కష్టకాలం వచ్చినా.. చివరకు తన తండ్రి రాజ్ కుమార్ మరణించిన సమయంలో కూడా ఆయన తట్టుకుని నిలబడి.. కుటుంబానికి అండగా నిలబడ్డారు. అసలు గత ముప్పై ఏళ్లలో శివ రాజ్‌కుమార్ వెక్కి వెక్కి ఏడుస్తున్న విజువల్స్ కన్నడ ప్రేక్షకులు ఎన్నడూ చూడలేదు.
కానీ, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియల్లో శివ రాజ్‌కుమార్ ర్ గుండెలవిసేలా రోధించారు. శివ రాజ్‌కుమార్ కన్నీళ్ళను చూసిన కన్నడ సినీ ప్రముఖులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ కి శివ రాజ్‌కుమార్ అన్నయ్య అయినా.. ఒక తండ్రిలా చూసుకునేవారు. ఇద్దరికి వయసులో 14 ఏళ్ళు తేడా ఉంది.
అందుకే.. చిన్నప్పటి నుంచి పునీత్ కి కావాల్సిన ప్రతిదీ శివ రాజ్‌కుమారే చూసుకునేవారు. స్కూల్ కి తీసుకెళ్లి తీసుకురావడం వరకూ, అలాగే పునీత్ కి సంబంధించిన ప్రతి కార్యక్రమం శివ రాజ్‌కుమార్ చేతుల మీదుగానే జరిగేది. పైగా ఎత్తుకొని ఆడించిన తమ్ముడు.. పెరిగి పెద్దయ్యాక, తమ కుటుంబానికి తోడుగా నిలబడ్డ తమ్ముడు.
ఎందరో స్టార్లు పుట్టుకొచ్చి.. రాజ్ కుమార్ వైభవాన్ని మరిచిపోయేలా చేస్తున్న తరుణంలో పునీత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మళ్ళీ రాజ్ కుమార్ ఫ్యామిలీనే కన్నడ నాట నెంబర్ వన్ గా నిలబెట్టాడు. అందుకే పునీత్ అంటే.. ఆ కుటుంబానికి ఎంతో ప్రేమ. అందుకే, తన ప్రియమైన సోదరుడు పునీత్.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడంటూ శివ రాజ్‌కుమార్ బిగ్గరగా ఏడుస్తూ గుండె పగిలేలా విలపించారు.
ఇక కంఠీరవ స్టూడియోలోని పునీత్ తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ అంతిమ సంస్కారాలు చేశారు. పునీత్ రెండో అన్నయ్య రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు చేశారు. పునీత్ సతీమణి అశ్వినీ, ఇద్దరు పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గుండెలవిసేలా విలపించారు.
Also Read: అన్న కొడుకు చేతుల మీదుగా ముగిసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎవరు చేయబోతున్నారంటే