బాలీవుడ్ లో సంచలనాలు రేపుతున్న పోర్న్ రాకెట్ లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కుంద్రా వ్యవహారంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్న మనీలాండరింగ్ అంశాలు ప్రధాన పాత్ర పోషించడంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. గత రెండు రోజులుగా రాజ్ కుంద్రా పాత్రపై లోతుగా అధ్యయనం సాగిస్తున్నాయి.
కేసులో అనేక ట్విస్టులు, టర్న్ లతో పలు విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బ్యాంకు వ్యవహారాలను సైతం అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా పలు సందేహాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది.
హాట్ షాట్, హాట్ హిట్, బాలీఫేమ్ వంటి యాప్ ల ద్వారా సమకూరిన ఆదాయంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. ఈ యాప్ ల ద్వారా వచ్చిన ఆదాయం ఉమ్మడి ఖాతాలకు మళ్లినట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జాయింట్ ఖాతాలో రూ. కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సమాచారం. వాటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రాజ్ కుంద్రాకు రెండు ఖాతాలు ఉన్నాయి. వాటిని 2016 నుంచి ఉపయోగించలేదు. కనీస బ్యాలెన్స్ కూడా పెట్టలేదు.
జులై 23న ముంబై క్రైమ్ పోలీసులు శిల్పాశెట్టి ఇంటిపై దాడి చేయడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆమెను ప్రశ్నించిన పోలీసులకు సమాధానం రాలేదు. కొన్నింటికి సమాధానాలు చెప్పలేక తప్పించుకున్నారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి రానున్న రెండు రోజుల్లో జులై 26న ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Shilpa shetty was in tears argued with raj kundra during raid at home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com