Shilpa Shetty: ‘శిల్పాశెట్టి’ ( Shilpa Shetty) ఆమె భర్త ‘రాజ్ కుంద్రా’ ( Raj Kundra ) అశ్లీల చిత్రాల వ్యవహారం బాగా ఇబ్బంది పెట్టింది. అలాగే ఎన్నో రకాలుగా ఆమెను అవమాన పరిచింది. నిజానికి శిల్పాశెట్టి టీవీ షోలు, యోగా కార్యక్రమాలతోనే ఫుల్ బిజీగా జీవితాన్ని గడిపేసేది. తన భర్త పని గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే, అతని సంపాదనను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. కాకపోతే, ఆ సంపాదన ఎక్కడ నుంచి వస్తోంది..? అని, అలాగే ‘రాజ్ కుంద్రా’ చేసిన హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి బూతు యాప్స్ బిజినెస్ గురించి తెలుసుకోలేకపోయింది.
ఆమెకు తెలిసినా, తెలియకపోయినా.. ‘రాజ్ కుంద్రా’ చేసింది దారుణమైన బిజినెస్. పైగా ఆ బిజినెస్ చేసే క్రమంలో అతను ‘శిల్పాశెట్టి’ పేరును బాగా వాడుకున్నాడు. ఆ విషయమే ఆమెకు తెలియదు. అందుకే, ‘రాజ్ కుంద్రా’ అరెస్ట్ తర్వాత కూడా ‘శిల్పాశెట్టి’ గుడ్డిగా భర్తనే సపోర్ట్ చేసింది. అతను అమాయకుడు, ఎవరో కావాలని అతన్ని ఇరికించారని ఆమె వివరణ ఇచ్చింది.
కానీ, పోలీసుల విచారణ తర్వాత గానీ.. అలాగే తన చుట్టూ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకున్న తర్వాత గానీ ‘శిల్పాశెట్టి’కి తత్త్వం బోధపడలేదు. అందుకే, తన భర్త చేసిన తప్పు ఆమెకు అర్ధం అయ్యాక, దైర్యంగా బయటకు వచ్చి.. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని తనను తాను సేవ్ చేసుకునే ప్లాన్ లో పడిపోయింది.
ఈ క్రమంలోనే ఆమె కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి భర్తకు విడాకులు ఇవ్వడం. ఈ మధ్య అందుకే ‘శిల్పాశెట్టి’ తన భర్త కేసు గురించి పట్టించుకోవడం లేదు, అదేవిధంగా ఆలోచించడం కూడా మానేసింది. మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లలో ఫోటోలు అప్ లోడ్ చేస్తూ సరదాగా గడుపుతుంది. ప్రస్తుతం ఎప్పటిలాగే తన టీవీ షోలు తానూ చేసుకుంటూ ముందుకు పోతుంది.
అయితే, ‘శిల్పాశెట్టి’ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పెట్టింది. ‘ముందుకు వెళ్లిన మన జీవితాన్ని వెనక్కి తీసుకెళ్లి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టలేం. కాకపోతే, మధ్యలోనైనా సరే మనదైన జర్నీని మొదలుపెట్టి ప్రయాణాన్ని కొత్తగా ముగించొచ్చు’ అంటూ ‘శిల్పాశెట్టి’ షేర్ చేసిన మెసేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మెసేజ్ సారాంశం.. భర్త రాజ్ కుంద్రాకి విడాకులు ఇవ్వడమే అని ప్రచారం ఎక్కువైంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Shilpa shetty shilpas latest post is all about life lessons
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com