https://oktelugu.com/

రాజ్ కుంద్రా అశ్లీలంపై బాంబు పేల్చిన షెర్లీన్ చోప్రా

బాలీవుడ్ లో రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎప్పుడు ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఈసారి పోర్న్ వీడియోల రూపంలో బయటకొచ్చింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. పోర్న్ రాకెట్ కేసులో విచారణకు మాజరైన శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలు బయటపెట్టింది. జులై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. రాజ్ కుంద్రా తనను వేధించాడని పేర్కొంది. షెర్లీన్ చోప్రా విచారణకు హాజరు కావాలని […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 29, 2021 / 03:05 PM IST
    Follow us on

    బాలీవుడ్ లో రాజ్ కుంద్రా వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎప్పుడు ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఈసారి పోర్న్ వీడియోల రూపంలో బయటకొచ్చింది. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. పోర్న్ రాకెట్ కేసులో విచారణకు మాజరైన శృంగార తార షెర్లీన్ చోప్రా సంచలన విషయాలు బయటపెట్టింది. జులై 27న విచారణకు హాజరైన ఆమెను అధికారులు ప్రశ్నించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. రాజ్ కుంద్రా తనను వేధించాడని పేర్కొంది.

    షెర్లీన్ చోప్రా విచారణకు హాజరు కావాలని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఆమె వారికి సహకరించింది. ముందస్తు బెయిల్ కోసం ముంబయి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షెర్లీన్ చోప్రా తనకు ఎదురైన అనుభవాలను పోలీసులతో పంచుకుంది. అయితే పోర్న్ రాకెట్ లో మార్చిలోనే తొలుత విచారణకు హాజరైన చోప్రా చెప్పిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజ్ కుంద్రాపై అనేక కోణాల్లో కేసు నమోదు చేసేందుకు ఆధారాలు వెతుకుతున్నారు.

    షెర్లీన్ చోప్రా వెల్లడించిన విషయాల్లో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. కొద్ది కాలంగా శిల్పాశెట్టికి రాజ్ కుంద్రాకు సరైన సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. వైవాహిక జీవితంలో ఇద్దరు సమస్యల్లో ఉన్నట్లు తెలిపింది. రాజ్ కుంద్రా తీవ్రమైన ఒత్తిడిలో ఉండేవాడని చెప్పింది. దీంతో వారి వైవాహిక జీవితంపై ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఏం చేసేవారు? ఎలా ఖర్చు పెట్టేవారు అనే విషయాలను సైతం ఆరా తీస్తున్నారు.

    రాజ్ కుంద్రా తనతో పిచ్చి వేషాలు వేసేవాడని షెర్లీన్ చెప్పింది. నన్ను గదిలో బంధించేందుకు ప్రయత్నించేవాడని వివరించింది. ముద్దు పెట్టుకోవడానికి సైతం ప్రయత్నించాడని తెలిపింది. ఎలాగో తప్పించుకుని చివరకు వాష్ రూంలో దాక్కున్నానని పేర్కొంది. దీంతో రాజ్ కుంద్రా దారుణంగా వేధింపులకు పాల్పడ్డారని కన్నీరుమున్నీరుగా విలపించింది.