తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుజూరాబాద్ అంబేద్కర్ కూడలిలో తెరాస, భాజపా వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీలను కించపరిచేలా ఈటల జమున సోదరుడు మధుసూదన్ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. అదే విషయంపై రెండు పార్టీల శ్రేణులు గొడవకు దిగాయి. దానిని తెరాస వర్గాయులే సృష్టించారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహానికి ఈటల జమున పాలభిషేకం చేశారు. అదే సమయంలో తెరాస వర్గీయులు అక్కడకు రావడంతో ఇరువురి మధ్య తోపులాట జరింది. ఇరు వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.