Rakesh Master Passed Away: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మంచి కొరియోగ్రాఫర్ గా రాకేష్ మాస్టర్ కి గొప్ప పేరుంది. ఇండస్ట్రీ లో నేడు ఒక వెలుగు వెలుగుతున్న శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ ఈయన శిష్యరికం నుండి వచ్చిన వాళ్ళే. నేడు వీళ్లిద్దరు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. అయితే శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతున్న సమయం లో గురు శిష్యుల మధ్య కొన్ని విబేధాలు ఏర్పడ్డాయి.
శేఖర్ మాస్టర్ పై రాకేష్ మాస్టర్ పలు సంచలన ఆరోపణలు చేసాడు, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ కూడా దానికి సోషల్ మీడియా లో క్లారిటీ ఇచ్చేసి, ఇక ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన ఎక్కడ ఉన్నా సంతోషం గానే ఉండాలి ,అదొక్కటే కోరుకుంటాను అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు.
నిన్న రాకేష్ మాస్టర్ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన మరణం యావత్తు సినీ లోకాన్ని మరియు అభిమానులను శోక సంద్రం లోకి నెట్టేసింది. శేఖర్ మాస్టర్ మరియు రాకేష్ మాస్టర్ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి కదా, రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని చూసేందుకు శేఖర్ మాస్టర్ వస్తాడో రాడో అని అందరూ అనుకున్నారు. కానీ శేఖర్ మాస్టర్ నేడు రాకేష్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నమస్కరించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ తాను ఈ స్థానం లో ఉన్నాను అంటే అందుకు కారణం రాకేష్ మాస్టర్ అని శేఖర్ మాస్టర్ ఎన్నో సందర్భాలలో తెలిపుకున్నాడు. అంతే కాదు ఢీ డ్యాన్స్ షో లో శేఖర్ మాస్టర్ తన గురువు రాకేష్ మాస్టర్ మీద ఉన్న ప్రేమ , అభిమానం ని చాటుకున్నాడు. కొన్ని విబేధాలు వచ్చినప్పటికీ కూడా రాకేష్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ కి గౌరవం ఏమాత్రం తగ్గలేదని ఈరోజు అందరికీ తెలిసింది.