Srihan- Siri Hanmanth Web Series: బిగ్ బాస్ రన్నర్ శ్రీహాన్ కి అవకాశాలు మొదలయ్యాయి.అతడు నటుడిగా బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా శ్రీహాన్-సిరి కాంబినేషన్ లో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న శ్రీహాన్ భారీగా ఫేమ్ తెచ్చుకున్నాడు. శ్రీహాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ తృటిలో కోల్పోయాడు. ఆత్మవిశ్వాసం లేక టైటిల్ రేవంత్ పరం చేశాడు. నాగార్జున రూ. 40 లక్షల ఆఫర్ ఒప్పుకోకపోతే విన్నర్ శ్రీహానే. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తెలివిగా శ్రీహాన్ ని ట్రాప్ చేశారు.

ఏది ఏమైనా నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని శ్రీహాన్ దెబ్బై పోయాడు. అతడు టైటిల్ గెలిస్తే రూ. 90 లక్షల వరకు దక్కేవి. టైటిల్ విన్నర్ అన్న పేరు మిగిలేవి. జరిగింది మార్చలేం కాబట్టి, దక్కిన దాంతో సంతృప్తి పడటమే. టైటిల్ చేజారిన బాధలో ఉన్న శ్రీహాన్ కి ఆఫర్స్ మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి నెల రోజులు గడవక ముందే శ్రీహాన్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. తన లవర్ సిరితో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మరో విశేషం ఏమిటంటే ఈ సిరీస్ నిర్మాతగా శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ నిర్మాత అవతారం ఎత్తుతున్నారు. శ్రీహాన్-సిరి కాంబినేషన్ లో వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు ఆయన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. వారితో దిగిన ఫోటో షేర్ చేశారు. ఈ సిరీస్ కి సుజీత్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని శేఖర్ మాస్టర్ తెలియజేశారు. ఈ క్రమంలో శ్రీహాన్ టైం మొదలైంది. ఇక నటుడిగా అతడు దూసుకుపోతాడు, అంటున్నారు.

అలాగే స్టార్ మా బీబీ జోడి పేరుతో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ అన్ని సీజన్స్ కంటెస్టెంట్స్ జంటలుగా ఏర్పడి ఈ షోలో పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. యాంకర్ రవితో పాటు సిరి ఈ షోలో కంటెస్టెంట్ చేస్తున్నారు. శ్రీహాన్ సైతం ఎంట్రీ ఇచ్చే సూచనలు కలవు. స్టార్ మా లేటెస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ ఫేమ్ ఉపయోగించుకునేందుకు కార్యక్రమాలు రూపొందిస్తుంది. బిగ్ బాస్ రన్నర్ అయిన శ్రీహాన్ ని ఏదో ఒక షోలో వారు భాగం చేస్తారనడంలో సందేహం లేదు.