https://oktelugu.com/

Shekhar Kammula – Mahesh Babu: మహేష్ బాబు తో లీడర్ 2 సినిమా చెయ్యబోతున్న శేఖర్ కమ్ముల

Shekhar Kammula – Mahesh Babu: టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. లేటెస్ట్ గా ఆయన సర్కారు వారి పాట సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ చిత్రం తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 17, 2022 / 02:01 PM IST

    Shekhar Kammula, Mahesh Babu

    Follow us on

    Shekhar Kammula – Mahesh Babu: టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. లేటెస్ట్ గా ఆయన సర్కారు వారి పాట సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ చిత్రం తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యనున్నారు.

    Shekhar Kammula – Mahesh Babu

    Also Read: NTR – Megastar Chiranjeevi: చిరంజీవి సూపర్ హిట్ సినిమాకి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తెలుసా?

    రాజమౌళి సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటుగా మరో సినిమాని లైన్ లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడట మహేష్ బాబు. ఆ సినిమా ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. శేఖర్ కమ్ముల ఇటీవలే నాగ చైతన్య తో తీసిన లవ్ స్టోరీ అనే సెన్సషనల్ హిట్ సినిమాతో మంచి ఊపు మీదున్నాడు. అయితే మహేష్ తో తియ్యబోయ్యే సినిమా తన కెరీర్ లో ప్రత్యేమైన స్థానం ని సంపాదించుకున్న లీడర్ సినిమాకి సీక్వెల్ అని తెలుస్తుంది. దగ్గుపాటి రానా హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన లీడర్ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని AVM సంస్థ వారు నిర్మించారు. ఇటీవలే AVM నిర్మాణ సంస్థకి సంబంధించిన అరుణ్ గుహన్ మాట్లాడుతూ లీడర్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ మహేష్ బాబు ఫాన్స్ ఈ విషయం లో కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నారు.

    leader 2

    Also Read:Big Boss 6: బిగ్ బాస్ 6 టెలికాస్ట్ తేదీ మరియు టైమింగ్స్

    ఎందుకంటే మహేష్ బాబు ఇది వరకే కొరటాల శివ తో ‘భరత్ అనే నేను’ సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఇందులో ఆయనది సీఎం క్యారక్టర్, ఇప్పుడు మళ్ళీ అదే రోల్ అంటే ఆడియన్స్ కచ్చితంగా భరత్ అనే నేను సినిమాతో పోల్చి చూస్తారంటూ భయపడుతున్నారు. ఇది వరకే మహేష్ బాబు శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఫిదా అనే సినిమా రావాల్సి ఉంది. కానీ మహేష్ బాబు ‘ఇది నా ఇమేజి కి సెట్ అయ్యే సినిమా కాదు. బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వదు. వేరే స్క్రిప్ట్ తీసుకొని రా చేద్దాం’ అని అన్నాడట. దీనితో అదే స్క్రిప్ట్ ని వరుణ్ తేజ్ తో తీసి ఇండస్ట్రీ లో పెద్ద హిట్ కొట్టాడు శేఖర్ కమ్ముల, అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది. ఇప్పుడు లీడర్ 2 తో ఆయన ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడు అనేది చూడాలి.

    Mahesh Babu

    Also Read: Bimbisara Movie: బాలీవుడ్ ఇండస్ట్రీ ని దున్నేయబోతున్న కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం
    Recommended Videos