Bigg Boss Telugu 8 : డబుల్ గేమ్స్ ఆడుతున్ననిఖిల్ ..బిగ్ బాస్ హిస్టరీ లోనే ఇలాంటి ఎమోషనల్ వీక్ కంటెస్టెంట్ ఉండడు!

ఒక్క సోనియా విషయం లో తప్ప నిఖిల్ అందరి విషయం లోనే ఒక స్ట్రాటజీ పరంగానే గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన సోనియా ని చీఫ్ గా చేసేందుకు పడిన కష్టాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. నిన్నటి ఎపిసోడ్ లో యష్మీ, సోనియా మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు నిఖిల్ యష్మీ ని దగ్గరకు తీసుకొని చాలాసేపు ఓదారుస్తాడు.

Written By: Vicky, Updated On : September 25, 2024 8:54 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 : నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ లాంటి ఎమోషనల్ వీక్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ అన్ని సీజన్స్ ని కలిపి చూసినా ఎవరూ లేరని ప్రేక్షకులకు అనిపించింది. యష్మీ తో ఉండాలని కోరుకుంటాడు, అదే విధంగా సోనియా తో కూడా తన రిలేషన్ ని కొనసాగించాలని అనుకుంటాడు. పృథ్వీ ని తన తమ్ముడు అని అంటాడు కానీ, అతన్ని బలంగా తొక్కే ప్రయత్నాలు చేస్తాడు. ఒక్క సోనియా విషయం లో తప్ప నిఖిల్ అందరి విషయం లోనే ఒక స్ట్రాటజీ పరంగానే గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆయన సోనియా ని చీఫ్ గా చేసేందుకు పడిన కష్టాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. నిన్నటి ఎపిసోడ్ లో యష్మీ, సోనియా మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు నిఖిల్ యష్మీ ని దగ్గరకు తీసుకొని చాలాసేపు ఓదారుస్తాడు.

ఆ తర్వాత ఆమె బాధపడుతూ సోనియా ప్రవర్తన గురించి చెప్పేవి స్పష్టంగా వింటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సోనియా దగ్గరకు వెళ్తాడు. ఆమె నిఖిల్ తో మాట్లాడిన మాటలు యష్మీ కి ఎందుకు చెప్పావ్ అంటూ సోనియా ఒక్క భార్య మొగుడు మీద ఎలా అయితే అరుస్తుందో నిన్న రాత్రి అలా అరిచింది. ఆమె అలా అరుస్తుంటే నిఖిల్ కి ఇసుమంత పౌరుషం కూడా రాలేదు. పైగా ఆమెని ‘దయచేసి క్షమించు’ అని చాలా సేపు బ్రతిమిలాడుకుంటాడు. నేను మీ ఇద్దరినీ వాడుకుంటున్నాను అట అని యష్మీ చెప్పినట్టు సోనియా నిఖిల్, పృథ్వీ చెప్తుండగా నిఖిల్ ‘అది తన అభిప్రాయం రా..మేమెందుకు అలా అనుకుంటాము’ అని అంటాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అభయ్ తో ఈ విషయాన్ని చర్చిస్తూ తను నన్ను ఆడుకుంటుంది రా, ఎలా అయినా ఆమెకు అర్థం అయ్యేలా చెప్పి బయటకి వచ్చేయాలి అని అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం సోనియా ముందు ఇలాంటి నాటకాలు ఆడాడు. ఇది ఇలా ఉండగా ‘కాంతారా’ క్లాన్ కి చీఫ్ స్థానం ఖాళీగా ఉండడంతో బిగ్ బాస్ ఆ క్లాన్ కి చీఫ్ ని ఎన్నుకునే అవకాశం హౌస్ మేట్స్ కి కల్పిస్తాడు. నిఖిల్ చీఫ్ కాబట్టి ముందుగా ఆయనని ఒకరిని చీఫ్ రేస్ నుండి తప్పించమని కోరుతాడు బిగ్ బాస్.

అప్పుడు నిఖిల్ మైండ్ లో సోనియా ని చీఫ్ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యి ఒక్కొక్కరిని రేస్ నుండి తప్పించే భాగం లో ఆదిత్య ఓం షీల్డ్ ని సుత్తితో బద్దలు కొట్టి చీఫ్ రేస్ నుండి తప్పిస్తాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరిని ఓడించి ప్రతీసారి సుత్తి ని తన చేతిలోకి తీసుకొని సోనియా ని ఎవరైతే రేస్ నుండి తప్పించరు అని ఆయన నమ్మాడో, వాళ్ళకే సుత్తి ని ఇస్తూ వచ్చాడు. చివరికి తన క్లాన్ సభ్యురాలు విష్ణు ప్రియా కి సుత్తి తీసుకునే ఛాన్స్ వస్తుంది. కానీ నిఖిల్ దానిని వదలదు. ఇది గమనించిన యష్మీ నిఖిల్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత కాంతారా టీం కి సంబంధించిన వారందరూ నిఖిల్ ని గట్టిగా పట్టుకొని విష్ణు ప్రియా కి సుత్తి అందేలా చేస్తారు. విష్ణు ప్రియా సుత్తి తీసుకొని వెంటనే సోనియా షీల్డ్ ని పగలగొట్టి చీఫ్ రేస్ నుండి తప్పిస్తుంది. అలా నిఖిల్ సోనియా ని చీఫ్ చేయాలని అనుకొని పడిన కష్టాన్ని కాంతారా టీం సభ్యులు వృధా అయ్యేలా చేసారు.