Shekar Master : ఈమధ్య కాలం లో శేఖర్ మాస్టర్(Shekar Master) ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు బూతు స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడంటూ స్వయంగా మహిళా కమీషన్ చేత కూడా చివాట్లు పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు లేటెస్ట్ గా జాను అనే డ్యాన్స్ కంటెస్టెంట్ తో శేఖర్ మాస్టర్ కి ఎదో లింక్ ఉన్నట్టు సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై శేఖర్ మాస్టర్ చాలా బాధపడుతూ స్పందించాడు. జాను అనే అమ్మాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఒక ప్రముఖ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నేను, జాను డ్యాన్స్ బాగుందని మెచ్చుకున్నాను, దానిని తప్పుడు ప్రచారం తో వేరే అర్థం వచ్చేలా చేస్తున్నారని, ఇది తనని చాలా బాధించిందని, తనకు కూడా కుటుంబం ఉందని, నా పిల్లలు ఇలాంటివి చూసి ఎంత బాధపడుతారో ఒక్కసారి ఆలోచించాలి అంటూ శేఖర్ మాస్టర్ భావోద్వేగంతో మాట్లాడారు.
Also Read : రణబీర్ కపూర్ ‘రామాయణం’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు!
శేఖర్ మాస్టర్ దివంగత రాకేష్ మాస్టర్ కి శిష్యుడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా అడుగుపెట్టి, గ్రూప్ డ్యాన్సర్ గా ఎన్నో వందల సినిమాలకు పని చేసి, ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారాడు శేఖర్ మాస్టర్. కొరియోగ్రాఫర్ అయ్యాక ఆయన అతి తక్కువ సమయంలోనే ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయాడు. చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు మేకర్స్ శేఖర్ మాస్టర్ తో కనీసం ఒక్క పాట అయిన కంపోజ్ చేయించుకుంటారు. ఆయన కంపోజ్ చేసే స్టెప్స్ ఆ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి మరి.
అందుకే అందరూ శేఖర్ మాస్టర్ కావాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంటారు. ఎన్ని వివాదాలు వచ్చినా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క కొన్ని రియాలిటీ షోస్ కి ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ అనే గేమ్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న షోస్ లో ఇది కూడా ఒకటి.
Also Read : అలాంటి డ్రామాలు ఆడడం నాకు రాదు అంటూ కేతిక శర్మ స్ట్రాంగ్ కౌంటర్!