https://oktelugu.com/

చైనాకు ఇక వణుకే.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్

సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు వణుకు పుట్టేలా.. ప్రపంచంలోనే అత్యుత్తమైన ‘రఫేల్’ జెట్ విమానాలు భారత అమ్ముల పొదిలో అధికారికంగా చేరాయి. ఫ్రాన్స్ తయారు చేసిన ఈ రఫేల్ జెట్స్ ను గురువారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్లోరెన్స్ పార్లే నేతృత్వంలో భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. Also Read: దౌర్భాగ్యం: ఈ నేరచరితులే మన పాలకులా? హర్యానాలోని అంబాలా వైమానికస్థావరంలో ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 / 01:20 PM IST

    rafel1

    Follow us on

    సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు వణుకు పుట్టేలా.. ప్రపంచంలోనే అత్యుత్తమైన ‘రఫేల్’ జెట్ విమానాలు భారత అమ్ముల పొదిలో అధికారికంగా చేరాయి. ఫ్రాన్స్ తయారు చేసిన ఈ రఫేల్ జెట్స్ ను గురువారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ప్లోరెన్స్ పార్లే నేతృత్వంలో భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు.

    Also Read: దౌర్భాగ్యం: ఈ నేరచరితులే మన పాలకులా?

    హర్యానాలోని అంబాలా వైమానికస్థావరంలో ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. త్రివిధ దళాదిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేసి రఫేల్ జెట్స్ వాయుసేనలో చేరాయి. మొదటి బ్యాచ్ కు చెందిన ఈ ఐదు విమానాలు జులై 29న హర్యానాలోని అంబాలాకు చేరాయి.

    భారత వాయుసేనలో 17వ స్క్వాడ్రన్ గోల్డెన్ ఆరోస్ లో వీటిని ప్రవేశపెట్టారు. ఇది భారత వాయసేనలో అత్యంత కఠినమైన ఆపరేషన్లకు పెట్టింది పేరు. మొత్తం యుద్ధ పర్యవేక్షణ ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.  పాకిస్తాన్ లోని బాలాకోట్ పై మొన్న దాడి చేసింది ఈ విభాగమే. అందుకే రఫేల్ ను ఈ విభాగంలోనే రక్షణ శాఖ చేర్చింది.  చైనా, పాకిస్తాన్ కు సమాన దూరంలో అంబాలా స్థావరం ఉంటుంది. భారత దేశ రక్షణ వ్యవస్థలో ఇది చాలా కీలకమైన స్థావరం. దీంతో పాక్, చైనాలకు ఇది శత్రుదుర్భేద్యంగా ఉండనుంది.

    Also Read: సుశాంత్ సింగ్ కేసులో అసలు విషయం పక్కదారి పడుతోందా?

    కాగా మోడీ సర్కార్ 2016లో ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దాదాపు 59,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టును ఫ్రాన్స్ కు చెందిన ఏరో స్పేస్ సంస్థ దసో ఏవియేషన్ చేపట్టింది. మొదటి 5 రఫేల్ విమానాలు ప్రస్తుతం భారత్ కు అందాయి.