Kriti Movie Child Artist: సినీ ఇండస్ట్రీ లో చిన్నప్పుడు బాలనటి గా నటించిన ఎంతో మంది అమ్మాయిలు పెద్దయ్యాక ఏ హీరో సినిమాలో అయితే బాలనటిగా నటించారో, ఆ హీరో సినిమాలోనే హీరోయిన్ గా నటించి సెన్సేషన్ సృష్టించారు. అలనాటి మహానటి శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పటి సూపర్ స్టార్స్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. మళ్ళీ ఆమె పెద్దయ్యాక ఆ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అదే విధంగా రాశి కూడా బాలయ్య సినిమాలో గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి, పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) కూడా ఆ కోవకి చెందిన అమ్మాయే అట. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సినిమాలు చేసింది.
సూర్య తమ్ముడు కార్తీ(Karthi Sivakumar) నటించిన ‘నా పేరు శివ’ అనే చిత్రం మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో తమిళం లో ‘నాన్ మహాన్ అల్లా’ అనే పేరుతో విడుదలైన ఈ సినిమాని, తెలుగు లో ‘నా పేరు శివ’ గా డబ్ చేసారు. తమిళం లో కంటే ఈ సినిమా తెలుగు లో పెద్ద హిట్ అయ్యింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కార్తీ ఒక సన్నివేశం లో, ఒక చిన్నారి పాపతో ‘హాయ్’ అని ముద్దుగా పలకరిస్తాడు. ఆ సన్నివేశం లో కనిపించిన చిన్నారి మరెవరో కాదు, కృతి శెట్టి. ఈమె పెద్దయ్యాక ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా మారి , ఆ తర్వాత పలు హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇప్పుడు ఈమె కార్తీ తో కలిసి ‘వా వాతియార్'(Vaa Vaathiyaar) అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఏ హీరో సినిమాలో అయితే ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా చేసిందో, అదే హీరో సినిమాలో ఇప్పుడు హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా డిసెంబర్ 5 న ముందుగా విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా డిసెంబర్ 12 కి వాయిదా పడింది. అప్పటికి కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. కానీ అప్పటికైనా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుందో లేదో చూడాలి. కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న కృతి శెట్టి, ఇప్పుడు తమిళ సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. ఈ చిత్రం తర్వాత ఆమె ప్రదీప్ రంగనాథన్ తో కలిసి నటించిన ‘LIK’ కూడా విడుదలకు సిద్ధం గా ఉన్నది.